గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్‌ రెండున్నర సంవత్సరంలో రాష్ట్రంఎదురుకొన్న సమస్యలు,సాదించిన విజయాలు చెప్పారు.
ఇవన్నీ మామూలే కాని, ఎమ్మెల్యే శ్రవణ్‌క విత చదివి చర్చను ప్రారంభించడం విశేషం. ఆంధ్రా వాడి దమ్ము ఏంటో చెప్పిన, ఆ కవిత ఇదే.


‘‘సోడాబుడ్డి కళ్లద్దాలు పోతే... రేబాన్‌ గ్లాసెస్‌ పెట్టినట్టు
పాత అంగీ లాగేస్తే... పొందూరు ఖద్దరు తొడిగినట్టు
మట్టిపలక పగిలిపోతే... డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ వచ్చినట్టు
దేకుడంటే చూపమంటే... రన్నింగ్‌లో గోల్డ్‌మెడల్‌ కొట్టినట్టు
దారులన్నీ మూసేస్తే... వేసిన అడుగే హైవే అయినట్టు
పదేళ్ల పందెం వేస్తే... రెండేళ్లలోనే గెలిచి చూపినట్టు
అడ్రస్ గల్లంతు చేస్తామంటే... దునియాకే డెస్టినీ అయినట్టు
టెంపరరీ శాంపిల్‌కే కళ్లు చెదిరితే... అమరావతి అసెంబ్లీ అద్భుతమైనట్టు’’.

Advertisements

Advertisements

Latest Articles

Most Read