నిన్న రాష్ట్ర మంత్రులు, శాసనమండలి, శాసనసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ముందుగా పట్టిసీమ దగ్గరకు వెళ్లారు... పట్టిసీమను తిలకించి మహాద్భుతంగా అభివర్ణించారు... అక్కడకు వెళ్ళిన రాయలసీమ ఎమ్మల్యేలు పట్టిసీమ పరవళ్ళు చూసి భావోద్వేగానికి లోనయ్యారు... ఈ నీరే లేకపోతే, మా రాయలసీమకు చుక్క నీరు ఉండేది కాదు అంటూ, గోదారమ్మకు దండం పెట్టారు... కొంత మంది ఎమ్మల్యేలు చాలా ఎమోషన్ అయ్యారు... పట్టిసీమ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటేనే భయం వేస్తుంది అన్నారు...
గోదావరి జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిది అని రాయలసీమ ఎమ్మల్యేలు అన్నారు... గోదావరి జలాలతో రాయలసీమ సస్యశ్యామలమవుతోంది, సీమ ప్రజల జీవితాలు బాగుపడ్డాయి, రాయలసీమను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం చంద్రబాబుది అంటూ వాళ్ళ అనుభూతులు పంచుకున్నారు... పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సీమకు పూర్తిగా సాగు నీరిస్తాం అనే ధీమా వచ్చింది అన్నారు... గోదావరి నుంచి పంపుల ద్వారా నీరు తోడి కృష్ణా డెల్టాకు తరలిస్తున్న తీరు స్వయంగా చూశారు. ముఖ్యంగా రాయలసీమ ఎమ్మెల్యేలు అత్యంత ఆసక్తిగా చూశారు. నీటి సరఫరా వ్యవస్థను ఆమూలాగ్రం తిలకించారు.. ఈ పథకం విలువేమిటో తెలిసిందని ప్రజాప్రతినిధులు అన్నారు.
తరువాత పోలవరం పనుల జోరు చూసి మురిసిపోయారు. కాంక్రీట్ పనులు, గ్రౌటింగ్.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం పనులు ముమ్మరంగా సాగుతుండడం చూసి హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ‘మహాద్భుతం. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్ప బలంతోనే పట్టిసీమ పూర్తయింది. దీనిని చూడడానికి రెండు కళ్లూ చాలలేదు అన్నారు... దారి పొడవునా పచ్చటి వరి చేలను చూసి కొందరు ప్రజాప్రతినిధులు అబ్బురపడ్డారు. నేల మీద పచ్చటి పరదా వేసినట్లు అన్ని చోట్లా కనిపించిందని.. ఈ మధ్యకాలంలో ఇంతలా ప్రకృతిని ఆస్వాదించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు....