ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం కంటే పోల్ మేనేజ్మెంట్ పేరుతో కోట్ల‌కు ఓట్లు కొన‌డం వైసీపీ క‌నిపెట్టిన కొత్త‌మార్గం. ప్ర‌జాస్వామ్యానికే పెనుప్ర‌మాదంగా ప‌రిణ‌మించిన ఈ అడ్డ‌దారి వైసీపీ  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మొద‌లు పెట్టింది. వైసీపీ స‌ర్కారుపై ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. ఫెయిర్ ఎల‌క్ష‌న్ జ‌రిగితే ఈ సీట్ల‌లో ఓట‌మి ఖాయ‌మ‌ని వైసీపీ అభ్య‌ర్థులు అడ్డ‌దారులు తొక్కుతున్నారు.  మార్చి 13న జరగనున్న ఉపాధ్యాయ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వైసీపీ చేయ‌ని అరాచ‌కం లేద‌ని ఉపాధ్యాయ‌సంఘాలు ఆరోపిస్తున్నాయి. అన‌ర్హుల‌ను ఉపాధ్యాయులుగా ఓట‌ర్ల జాబితాలో చేర్పించ‌డం, దీనికి అడ్డుప‌డే నిజాయితీ అధికారుల‌ను బ‌దిలీ చేయించ‌డం, వైసీపీ నేత‌లు చెప్పిన‌ట్టు వినే అధికారుల‌ను ఆయా స్థానాల్లో నియ‌మించ‌డంతో ఎలాగైనా గెల‌వాల‌నే వైసీపీ బ‌రితెగింపు క‌నిపిస్తోంది.  కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి వైసీపీ ఆశీస్సుల‌తో పోటీ చేస్తున్న రామచంద్రారెడ్డి గిఫ్ట్ బాక్సుల‌తో మాస్టార్ల‌ని బుట్ట‌లో వేసుకోవాల‌నుకున్నారు. అనంతపురంలో లంచ్‌ బాక్సులు పంపిణీ చేస్తూ ప‌ట్టుబ‌డ్డారు. క‌డ‌ప‌లో గిఫ్ట్ ల‌ పంపిణీని ప్ర‌జాసంఘాలు అడ్డుకుని ఏకంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి, ఓట‌ర్ల‌కు తాయిలాలు పంచుతోన్న రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాల‌ని ఫిర్యాదులు అందాయి. చివ‌రికి గిఫ్ట్ బాక్సులు నిల్వ ఉంచిన  స్కూలు యజమాని శివశంకరరెడ్డిపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్లు కేసు నమోదు చేశారు. అంటే వైసీపీ రామ‌చంద్రారెడ్డి ఈ కేసు నుంచి త‌ప్పించి నీరుగార్చార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read