పార్వతీపురంలో టెన్షన్ వాతవరణం నెలకొంది. అక్కడ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని చెప్పి, ఏడు గంటలకే పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు అక్కడకు చేరుకున్నారు. ఈ దశలో ఓట్ల లెక్కింపు ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యింది. తొలత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. ఈ దశలో స్థానిక వైసిపీ ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే జోగారావుని పోలీసులు లెక్కింపు కేంద్రం వద్దకు అనుమతించారు. అయితే ఇది తెలుసుకుని స్థానికంగా ఉండే టిడిపి ఎమ్మెల్సీ అయిన జగదీశ్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఇద్దరూ కలిసి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు వచ్చారు. అయితే మాజీ ఎమ్మెల్యేని లోపలకు అనుమతించలేదు. అయితే జగదీష్ ను మాత్రం నేను ఎమ్మెల్సీని, నన్ను కూడా లోపలకు అనుమతించాలని, వైసీపీ ఎమ్మెల్యేను ఏ విధంగా అనుమతించారో, నన్ను కూడా పంపించాలని జగదీశ్ పట్టుబట్టారు. అయితే దీనికి పోలీసులు అభ్యంతరం చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేను పంపించి, నన్ను ఎందుకు పంపించలేదు అనటంతో, పోలీసులకు, ఎమ్మెల్సీకి మధ్య వాదన జరిగింది. ఈ వాదన క్రమంలో, జగదీశ్ ని నెట్టే క్రమంలో, ఈ గొడవలో, ఆయన చొక్కా పూర్తిగా చిరిగిపోయింది. దీంతో టిడిపి నేతలు అక్కడ నిరసన చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read