వైసీపీ బరితెగింపు ఏ రేంజులో ఉంటుందో చెప్పక్కర్లేదు. 35 మంది కమ్మ డిఎస్పీలుగా తెలుగుదేశం ప్రమోషన్ ఇచ్చిందని ప్రచారంచేసిన వైసీపీ అందులో ఐదుగురే కమ్మ అని తెలిసినా, ఇప్పటికీ అదే ప్రచారంచేస్తూనే ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యిమంది తన సొంత సామాజికవర్గం వారికి ఉన్నత పదవులు కట్టబెట్టిన జగన్ రెడ్డి సామాజిక న్యాయం అంటే తన సొంత సామాజికవర్గానికి న్యాయం అని కొత్త సూత్రం కనిపెట్టారని టిడిపి ఆరోపిస్తూ వచ్చింది. ఎవరేమన్నా ఆరోపించుకోండి, తానైతే పేరు చివర రెడ్డి ఉంటే చాలు అన్నంతగా నియామకాలు, పదవుల పందేరాలు సాగాయని టిడిపి నేతలు అనెక్ సార్లు ఆరోపించారు. తాజాగా తన కులపిచ్చని దాచుకోకుండా అభ్యర్థుల్ని ఎంపిక చేసిన జగన్ కులాభిమానం చూసి ఇతర రాజకీయ పార్టీల నేతలు అసూయతో కుళ్లిపోతున్నారు. పశ్చిమ రాయలసీమ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎం.వి.రామచంద్రారెడ్డి, తూర్పు రాయలసీమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి, తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను ప్రకటించి తనకి తన సామాజికవర్గమే ముఖ్యమని చాటారు. ఉత్తరాంధ్రలో అక్కడ తప్పనిసరై ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ ని ప్రకటించారు. ఇక్కడా అన్యాయమే. బీసీలకు న్యాయం చేయడంలో తాను అభినవ పూలేనని ప్రచారంచేసుకునే జగన్ బీసీల అడ్డా ఉత్తరాంధ్ర స్థానానికి బ్రాహ్మణుడైన సీతంరాజు సుధాకర్ని ప్రకటించి తమకి అన్యాయం చేశారని వైసీపీలో బీసీ నేతలు ఆవేదనతో ఉన్నారు.
పట్టభద్రులు, టీచర్ స్థానాలు కావా? వైసీపీ రెడ్డి కోటా ఎమ్మెల్సీ ఎన్నికలా?
Advertisements