పౌరుల్లో ఆర్ధిక అక్షరాస్యత, డిజిటల్ బ్యాంకింగ్ పరిజ్ఞానం పెంపొందించేందుకు మొబైల్ ఏటీఎంలను ప్రారంభించినట్లు మన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లి ప్రజావేదిక ప్రాంగణంలో సోమవారం ఆప్కాబ్ తీసుకొచ్చిన 12 ఏటీఎం వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా మినహా 12 జిల్లాలకు 12 మొబైల్ ఏటీఎంలు పనిచేస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతాంగానికి నగదు కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాలలోని గిరిజన ప్రాంతాలకు ఈ మొబైల్ ఏటీఎంలు ప్రత్యేక సేవలు అందిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్ర సహకార బ్యాంకింగ్ వ్యవస్థకు లేని ఏటీఎం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందన్నారు. నాబార్డు ఆర్ధిక సహాయంతో ఈ మొబైల్ ఏటీఎంలను ప్రవేశపెట్టినట్లు పిన్నమనేని తెలిపారు.ఈ ఈ ఏటీఎంలలో మైక్రో ఏటీఎం, పేటిమ్, క్యాష్ విత్ డ్రా, క్యాష్ డిపాజిట్ సదుపాయాలున్నాయని, ఈ ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహిస్తే చార్జీల రూపంలో వసూలు చేసే నగదు మన దేశానికే దక్కుతుందని, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పేటీఎంకు చెందుతాయన్నారు.
మైక్రో ఏటీఎం ద్వారా ఈ-పోస్ సేవలు లభ్యమవుతాయని తెతిపారు. దేశంలో మరే రాష్ట్ర సహకార బ్యాంకింగ్ వ్యవస్థకు లేని ఏటీఎం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమన్నారు. వాణిజ్య బ్యాంకుల కన్నా సేవా చార్జీలు తక్కువగా వసూలు చేస్తున్నట్లు ఆప్కాబ్ ఎండీ భవానీ శంకర్ చెప్పారు. డిజిటల్ అక్షరాస్యతా కేంద్రమని, ఇందులో వినియోగదారులకు సేవలు అందిస్తూ ,మరో పక్క వారిలో డిజిటల్ చైతన్యం తేవడానికి వాహనానికి ఒక కౌన్సిలర్ ఉంటాడని ఆయన చెప్పారు.