సామాన్యంగా చంద్రబాబు ఏదన్నా పని చేస్తున్నారంటే, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు... ఏ సందర్భం లేకపోయినా చంద్రబాబు పై కారాలు మిరియాలు నూరుతున్నారు.. అయితే చంద్రబాబు సియంగా ఉండి, మోడీ పై వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే, ఈ విషయంలో బీజేపీ నేతలు విమర్శలు చేస్తారేమో అని అందరూ అనుకున్నారు.. కాని, ఒకటి అరా తప్పితే, ఎవరూ చంద్రబాబుని పెద్దగా విమర్శించటం లేదు... ఈ విషయం పై బీజేపీ నేతలకు ఆరా తీస్తే, ఆశక్తికర విషయం చెప్తున్నారు.. ముఖ్యమంత్రిగా ఉంటూ పోరాటం చెయ్యటం అంటే మాములు విషయం కాదు.. మాములుగా అయితే, మేము విమర్శించే వాళ్ళం, కాకపొతే మా నరేంద్ర మోడీ కూడా ముఖ్యమంత్రిగా ఉండగా, ఇలాగే దీక్ష చేసారు, అందుకే మేము ఏమి గెట్టిగా మాట్లాడలేకపోతున్నాం అంటూ, సమాధానం చెప్పారు..

modi 18042018

2006లో, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోదీ 51 గంటల పాటు నిరశన దీక్ష చేపట్టారు. నర్మదా డ్యాం ఎత్తు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ఆయన ఈ ఆందోళనకు దిగారు. ఈలోగా న్యాయస్థానం నిర్ణయం ఆయన డిమాండ్‌కు అనుకూలంగా వెలువడటంతో ఒక్క రోజులోనే తన దీక్షను ముగించారు. ఇప్పటి వరకు, కేంద్రంపై పోరాటానికి నిరశన దీక్షను ఒక పోరాట పంథాగా చరిత్రలో ఆరుగురు ముఖ్యమంత్రులు ఎంచుకున్నారు. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ నుంచి 2017లలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దాకా, ఇలా ముఖ్యమంత్రులుగా ఉంటూ దీక్ష చేసారు... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, చంద్రబాబు మొదటి సారి..

modi 18042018

1982లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజీ రామచంద్రన్‌ చెన్నై మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి వద్ద ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరశన చేపట్టారు. పాఠశాల విద్యార్థులకు ఆయన ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించింది. ఇందుకు కేంద్రం నుంచి తమిళనాడుకు మరిన్ని బియ్యం కావాలని కోరింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్పందించకపోవడంతో ఆయన ఈ ఆందోళన చేపట్టారు. నాటి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రధానితో మాట్లాడి తమిళనాడుకు బియ్యం కోటా పెంచేలా ఒప్పించారు. 1993లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్‌ సమాధి వద్ద నిరాహారదీక్ష చేశారు. కర్ణాటక 205 టీఎంసీల కావేరి జలాలను తమిళనాడుకు ఇవ్వాలని ట్రైబ్యునల్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలు చేసేందుకు కేంద్రం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆమె దీక్షకు దిగారు.

modi 18042018

2006లో నరేంద్రమోదీ గురించి పైన చెప్పుకున్నాం.. తమిళనాడులో 2009లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి నిరాహారదీక్ష చేపట్టారు. శ్రీలంకలోని తమిళ టైగర్లపై అక్కడి ప్రభుత్వం యుద్ధానికి దిగడంతో ఇందుకు నిరసనగా ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రెండు సందర్భాల్లో నిరాహారదీక్ష చేశారు. 2011లో రాష్ట్రంలో పంటలు మంచు కారణంగా నష్టపోయినందున రైతులకు కేంద్రం పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. 20 నిముషాల్లోనే ముగించారు. తిరిగి 2017లో రాష్ట్రంలో రైతు ఉద్యమాల నేపథ్యంలో శాంతి ఏర్పడాలని కోరుకుంటూ దీక్షకు దిగారు. 2018లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, తన ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో కలిసి ఏప్రిల్‌ నెలలో దీక్షకు దిగారు. కావేరి నిర్వహణ బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రం ఆలస్యం చేస్తోందని నిందిస్తూ వారీ దీక్ష చేపట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read