నోరు తెరిస్తే చాలు, బీజేపీ వాళ్ళు చెప్పే దేశభక్తి సూక్తులకు అంతే ఉండదు.. అక్కడికి దేశం పట్ల వారికే ప్రేమ ఉన్నట్టు, మిగతా వారందరూ, అసలు దేశాన్నే ప్రేమించరు అన్నట్టు బిల్డ్ అప్ ఇస్తూ ఉంటారు. అసలు బీజేపీ పార్టీ ఎజండానే ఈ దేశభక్తి అనే కాన్సెప్ట్.. హిందూ కాన్సెప్ట్ తో ఓట్లు పడవని గ్రహించి, ఈ మధ్య ఈ దేశభక్తి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎక్కడ చూసినా, బీజేపీ వాళ్ళు, ఇవే సూక్తులు. ఈ దేశం నిలుస్తుందే మా వల్ల అనేంతగా కబురులు చెప్తూ ఉంటారు. అయితే, ఇవన్నీ చెప్పటానికి, ఆచరణకు మాత్రం కాదు. ఎంతో మంది బీజేపీ నాయకులు, ఇలా ప్రవర్తించటం చూసాం, కాని ఈ రోజు సాత్వంత్ర్య దినోత్సవం వేళ సాక్షాత్తు, ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన పనికి, అందరూ అవాక్కయారు.
ప్రధాని మోడి సాత్వంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గుని ప్రసంగించారు. ప్రసంగం ముగియగానే, జాతీయ గీతం ప్రారంభం అయ్యింది. అయితే, ప్రధాని మోడీ మాత్రం, మంచి నీళ్ళు తాగుతూ కనిపించారు. వెంటనే తేరుకుని, అప్పుడు నుంచున్నారు. ఈ పరిణామం చూసి, ఇదేనా జాతీయ గీతం పై ప్రధానికి ఉన్న గౌరవం, జాతీయ గీతం వస్తుందని ప్రధానికి ఆ మాత్రం తెలియదా అని విపక్షాలు విమర్శలు చేసాయి. ఇక అమిత్ షా విషయానికి వస్తే, ఇది మరీ ఘోరం. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలోని 6ఏ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగరేశారు. కానీ ఆయనకు ఈ కార్యక్రమం పెద్ద ఇబ్బందినే తెచ్చి పెట్టింది.
అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు తాడుని లాగారు. జెండా కాస్తా కిందకు జారి నేలకు తగిలింది. వెంటనే తన పొరపాటు గుర్తించిన షా ఎగరేయాల్సిన తాడుని లాగి జెండా ఎగరేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బీజేపీ మీద దాడులు ప్రారంభించింది. ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలో ఆ వీడియోని పెట్టి అమిత్ షాని ట్రోలింగ్ చేస్తోంది. జాతీయ పతాకాన్ని సరిగ్గా ఎగరేయలేనివాళ్లు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించింది. ఇతరులకు దేశభక్తి గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లకు ఇలాంటివి తెలియదా అని విమర్శించింది. అమిత్ షా జెండా తప్పిదం వీడియో, మోడీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో ఇక్కడ చూడవచ్చు, https://www.facebook.com/Public365/videos/300939530677397/