రాష్ట్ర విభజనతో ఏపీకి నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఏపీకి మోదీ ఏం చేయలేదని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న బీహార్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అన్ని రకాలుగా ఏపీని మోదీ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. హామీలు అమలు చేయాలని అడిగినందుకు దాడులు చేశారని మండిపడ్డారు. మోదీ పెద్దన్న పాత్ర పోషించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్ళు కావాలని ఆనాడు బీజేపీనే అడిగిందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగురాష్ట్రాల ప్రజలు మాట్లాడుకోలేని పరిస్థితి తెచ్చింది మోదీనే అని ఆయన అన్నారు.

bihar 05052019

తెలంగాణకు రాజధాని ఉందని, 60 ఏళ్ళ కష్టార్జితాన్ని వదులుకుని వచ్చామని చంద్రబాబు అన్నారు. డబ్బు, కులం చూసి ఓటేస్తే.. రాజకీయ నేతలు ఎందుకు పనిచేయాలని అన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని చెప్పారు. వైసీపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని, ఎన్నికల్లో సైలెంట్‌ ఓటు తమకే అనుకూలమని అన్నారు. తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు టీడీపీ విజయానికి కీలకం కానున్నాయని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీపైనే ఎందుకు బీజేపీ కక్షసాధిస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ సమస్యనూ మోదీ పరిష్కరించలేదని.. ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీవి చౌకబారు ప్రసంగాలు, కించపరిచే వ్యాఖ్యలని విమర్శించారు. విభజన చట్టంపై ప్రధాని, హోంమంత్రి ఒక్క సమావేశం అయినా ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ శాశ్వతంగా దోషిగా మిగిలిపోతుందని అన్నారు. ఎదుటివారిపై దాడులు చేయడం తప్ప మోదీ సాధించిందేమీ లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

 

bihar 05052019

"నిన్న బీహార్‌లో మోదీ వ్యాఖ్యలకున్న సందర్భం ఏంటి..? ఎందుకీ వ్యాఖ్యలు చేశారు అసందర్భంగా..? ఆ రోజు ఆంధ్రాకు జరిగిన అన్యాయాన్ని ఎందుకు చక్కదిద్దలేక పోయారు..? 5 ఏళ్లలో ఏపి విభజనపై ఒక్క మీటింగ్ కూడా ఎందుకని పెట్టలేదు..? సమస్యలు పరిష్కరించకుండా విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకునే పరిస్థితులు తీసుకొచ్చింది మీరు కాదా..? ఇది ప్రధాని నరేంద్రమోదీ వైఫల్యాలు కావా..? అప్పుడు వాజ్ పేయి బాగా చేస్తే, ఇప్పుడు మీరేం చేశారని అడుగుతున్నా..? కాకినాడ పెట్రోల్ కాంప్లెక్స్ ఎందుకివ్వలేదు..? తెలంగాణకు 450 కోట్లు ఇచ్చి, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన రూ.350కోట్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ముందు వీటికి సమాధానాలు చెప్పండి. ప్రత్యేక హోదా ఇవ్వండి, విభజన హామీలు నెరవేర్చండి ఆ తర్వాతే ఆంధ్రా గురించి మాట్లాడండి. అంతే గానీ రాజకీయ లబ్ధికోసం చౌకబారు వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లో చులకన అయిపోతారు. వారే మీకు గుణపాఠం చెప్తారు." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read