నిన్న ఏపి బీజేపీ బూత్‌ కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గుని, ఏపికి ఇవి చేసాం, అవి చేసాం అంటూ, మధ్య పెట్టిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ కి డబ్బులు ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వమే కట్టటం లేదు అంటున్నారు. లోటు బడ్జెట్‌, రిసోర్స్‌ గ్యాప్‌ కింద ఏపీకి 20 వేల కోట్ల ఇచ్చామని, అవి ఎవరి జేబులోకి వెళ్ళాయో తెలియదు అంటున్నారు. వెనుకబడిన జిల్లాలకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చాం అన్నారు. విద్యాసంస్థలు ఇచ్చేసాం అన్నారు. మేము ఎన్నో వేల కోట్లు నిధులు ఇచ్చాం, కాని రాష్ట్ర ప్రభుత్వం యూసీలు ఇవ్వలేదు అంటూ, ఆరోపణ చేసారు. అయితే ప్రధాని మోడి చెప్పిన ప్రతి దానికి, ఇది వాస్తవంతో కూడిన సమాధానం... పోలవరం ప్రాజెక్ట్: డిసెంబర్ 15వ తేదీ వరకూఖర్చు పెట్టింది : రూ.10,069.66 కోట్లు. కేంద్రం విడుదల చేసింది: రూ.6,727.36 కోట్లు. కేంద్రం ఇంకా చెల్లించాల్సింది: రూ.3,342.40 కోట్లు. (గత నాలుగు నెలలుగా ఒక్క రూపాయీ విడుదల చేయలేదు) . చెల్లించాల్సిన డబ్బులు పై, వడ్డీ భారం రాష్ట్రానిదే. రూ.57,940.86 కోట్లతో సవరించిన వ్యయ అంచనాలు 2017 ఆగస్టు 16న ఇస్తే, ఇప్పటి వరకు దాని పై స్పందన లేదు....... వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ: రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మొత్తం 7 జిల్లాలకు కె-బి-కె, బుందేల్ ఖండ్ ప్యాకేజీ కింద రావాల్సింది రూ.24,350 కోట్లు.. కేంద్రం ఇచ్చింది: 2014-15, 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ.1050 కోట్లు... రూ.1049.34 కోట్లకు యూసీలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది... 2018 ఫిబ్రవరి 9న రూ.350 కోట్లు విడుదల చేసి, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండానే అదే నెల 15న ఏకపక్షంగా వెనక్కి తీసుకుంది... 2017-18, 2018-19 సంవత్సరాల కోసం రూ.700 కోట్లు విడుదల చేయాలని నీతి ఆయోగ్‌ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సిఫార్సు చేసింది. అయినా ఎలాంటి నిధులు విడుదల చేయలేదు.

modi 03012019 2

విద్యాసంస్థలు: ఏర్పాటు చేయాల్సిన విద్యాసంస్థల సంఖ్య: 11... తాత్కాలిక ప్రాంగణాల్లో కొనసాగుతున్నవి: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ఐఐఐటీడీఎం (2015-16 నుంచి), ఐఐపీఈ, ఎన్‌ఐడీఎం (2016-17 నుంచి), కేంద్ర విశ్వవిద్యాలయం, ఏఐఐఎంఎస్‌ (2018-19 నుంచి).. ఇంకా ఏర్పాటు కానివి: గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బదులుగా ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.135 కోట్లు ఇచ్చారు... 11 విద్యా సంస్థల ఏర్పాటుకు కావాల్సిన మొత్తం: రూ.12,746.38 కోట్లు... 2014-19 మధ్య కేంద్రం విడుదల చేసింది: రూ.845.42 కోట్లు... 11 విద్యాసంస్థల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి: 2909.17 ఎకరాలు... భూ సంరక్షణ, భూసేకరణకు వెచ్చించిన మొత్తం: రూ.131.33 కోట్లు... రూ.12,746.38 కోట్లకు, రూ.845.42 కోట్లు ఈ అయుదు ఏళ్ళలో ఇస్తే, ఈ విద్యాసంస్థలు ఎప్పటికి రెడీ అవుతాయి ?

modi 03012019 3

రెవెన్యూ లోటు: రాష్ట్ర విభజన జరిగిన తొలి ఏడాదిలో రెవెన్యూ లోటు భర్తీకి రూ.16,078.76 కోట్లు మొదటి సంవత్సరంలోనే ఇవ్వాలి... కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చింది రూ.3,979.50 కోట్లు... (2014-15 లో రూ. 2303 కోట్లు, 2015-16లో రూ. 500 కోట్లు, 2016-17లో రూ. 1,176.50 కోట్లు)... హామీ ప్రకారం రూ.16,078.76 కోట్లను 2014-15 లో విడుదల చేయాల్సివుంది. కాని ఇప్పటి వరకు, 3,979.50 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి... యూసీలు: 2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని వివిధ నిబంధనల క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రూ.14,259.32 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది.... రూ.13,620.79 కోట్ల మొత్తానికి యూసీలను సమర్పించడమయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read