మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్ గాంధీపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. నిండు సభలో మోదీని ఆలింగనం చేసుకుని.. తమ కుటుంబంపై చేస్తున్న విమర్శలకు ప్రేమతోనే సమాధానమిస్తామని చెప్పిన రాహుల్.. మరోసారి అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అయితే ఈసారి ట్విట్టర్ వేదికగా జవాబిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ తన వాళ్లతో మిస్టర్ క్లీన్ అనిపించుకుంటున్నా... నెంబర్ వన్‌ అవినీతిపరుడిగానే చనిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

rajiv 05052019

తాజాగా రాహుల్ ట్వీట్ చేస్తూ.. ‘‘మోదీ గారూ.. యుద్ధం ముగిసింది. మీ కర్మ మీకోసం ఎదురుచూస్తోంది. మా నాన్నగారిపై మీరు పెట్టుకున్న అంతర్గత నమ్మకాలేవీ.. మిమ్మల్ని ఏమాత్రం రక్షించలేవు. నా ప్రేమ, హగ్ మీ కోసం’’ అంటూ ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా బోఫోర్స్ కేసు వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఇది కోర్టులో ఉండగానే ఆయన ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో చనిపోయారు. మరణానంతరం ఆయనకు క్లీన్ చీట్ లభించింది. దీన్ని ఉద్దేశిస్తూనే ప్రధాని మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

rajiv 05052019

ఇది రాహుల్ ట్వీట్... "Modi Ji, The battle is over. Your Karma awaits you. Projecting your inner beliefs about yourself onto my father won’t protect you. All my love and a huge hug. Rahul".. మోడీ వ్యాఖ్యల పై చాలా మంది కూడా స్పందించారు. వారిలో హీరో సిద్ధార్ద్ కూడా ఉన్నారు "The life of #RajivGandhi did not just end. It was violently ended. He was murdered the same way our soldiers in #Pulwama were. No #PrimeMinister has ever set the bar for decency so very low. Distressing. #Shame' అని స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read