నిన్న నిజామాబాద్‌లో, మహబూబ్ నగర్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. అయితే చంద్రబాబు మోడీతో వైరం పెట్టుకున్న తరువాత, ఆయన తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది ఇదే ప్రధమం కావటం, అదీ ఎన్నికల ప్రచారం కావటంతో, అందరూ మోడీ ప్రసంగం పై ఆసక్తి చూపించారు. మోడీ, చంద్రబాబు పై విమర్శలు చేస్తారని, కాంగ్రెస్ తో కలిసినందుకు, ఎన్టీఆర్ సెంటిమెంట్ వాడతరాని అందరూ అనుకున్నారు. హైదరాబాద్ వేదికగా, చంద్రబాబు చేస్తున్న జాతీయ ఫ్రంట్ పై విమర్శలు గుప్పిస్తారని అందరూ అనుకున్నారు. కాని, మోదీ కాంగ్రెస్ పైనే విమర్శలు చేశారు. ప్రజాకూటమి మాట ఎత్తకుండా మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
టీఆర్‌ఎస్‌ది కుటుంబపాలన అంటూ విమర్శించే హక్కు ఎక్కడిదంటూ .. సోనియా, రాహుల్ విమర్శలను మోదీ తప్పుబట్టారు. చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా మోదీ తన ప్రసంగం ముగించారు. యూపీఏ ఉప్పు తిన్న వ్యక్తి.. కేసీఆర్ అని, చంద్రబాబు దగ్గర పని చేసారని, మోదీ బహిరంగ సభలో అన్నారు. చంద్రబాబు అనే మాట చెప్పింది ఇక్కడే. అయితే మోడీ ప్రసంగం పై అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే మొన్న అమిత్ షా కూడా, ఎక్కడా చంద్రబాబు ప్రస్తవాన తేలేదు. దీనికి అసలు కారణం ఏంటో విశ్లేషిస్తే, మోడీ జాతీయ స్థాయిలో చంద్రబాబు ప్రభావం అసలు కనపడుకుండా చేస్తున్నారు. తెలంగాణాలో కూటమి గెలుపు తధ్యం అని తెలిసిన తరువాత, కూటమి పై విమర్శలు చేస్తే, రేపు అదే సక్సెస్ ఫార్ములా అని చంద్రబాబు జాతీయ స్థాయిలో చూపిస్తారు. అందుకే అసలు కూటమి మధ్య యుద్ధం జరుగుతున్నట్టు చెయ్యకూడదు అనేది మోడీ-షా ఎత్తుగడ. చంద్రబాబుని విమర్శ చేస్తే, మోడీ కూటమిని విమర్శించారు అనే ప్రచారం జాతీయ స్థాయిలో వస్తుంది. రేపు కూటమి గెలిస్తే, మోడీ కూటమితో డీ కొని ఓడిపోయారు అనే ఫోకస్ వెళ్తుంది. అందుకే మోడీ, అసలు చంద్రబాబుని పట్టించుకోలేదు.
మరో పక్క కేసీఆర్ మాత్రం, చాలా ఫూలిష్ గా, తెలంగాణా యుద్ధం కాంగ్రెస్ పార్టీతో అని చెప్పకుండా, చంద్రబాబుతో యుద్ధం అన్నట్టు, తెలంగాణా ఎన్నికలని మార్చేసారు. 13 సీట్లలో పోటీ చేసే చంద్రబాబుని కాకుండా, ఉత్తం కుమార్ రెడ్డిని ఫోకస్ చేసుకుంటే, కేసీఆర్ కు ఎన్నికల ప్రచారం ఈజీ అయ్యేది. చంద్రబాబుని టార్గెట్ చెయ్యటంతో, చంద్రబాబు ఏమి చేసారు, కేసీఆర్ ఏమి చేసారు అనే చర్చ వస్తుంది. చంద్రబాబు హైదరాబాద్ కి ఏమి చేసారో ప్రపంచం మొత్తం తెలుసు. మరో పక్క, కేసీఆర్ ఎంత తిట్టినా, చంద్రబాబు మాత్రం కేసీఆర్ ని ఎక్కడా విమర్శించలేదు. చంద్రబాబు అలా చేస్తే, కేసీఆర్ అనుకున్న పాచిక పారేది. ఆంధ్రోడు మనల్ని తిడుతున్నాడు అంటూ ప్రజల్లో మరింత సెంటిమెంట్ రగిలించే వారు. చంద్రబాబు పై మోడీ విమర్శలు చెయ్యక పోవటం కాని, చంద్రబాబు కేసీఆర్ పై విమర్శలు చెయ్యకపోవటం కాని చూస్తే, సరైన రాజకీయం తెలిసినవాడు చేసే పని ఇది అని అర్ధమవుతుంది. కాని కేసీఆర్ మాత్రం, చంద్రబాబుని తిడుతూ, అసలు అజెండా పక్కన పెట్టేసారు. ప్రజలకి నువ్వేమి చేసావో చెప్పాలి కాని, చంద్రబాబు ఏమి చేసాడో కాదు కదా.