ఏపీకి ఎంతో చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుంటూరులో చెప్పిన లెక్కలపై సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ఆనాడు లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, రాజకీయాల కోసం కాదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే మరో 15 సీట్లు గెలిచేవాళ్లమని అన్నారు. ఏపీకి రూ. 3 లక్షల కోట్లు ఇచ్చామని మోదీ చెబుతున్నారని, ఎక్కడ ఇచ్చారు? దేనికి ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. పెత్తందారీ వ్యవస్థను టీడీపీ ఉపేక్షించదన్నారు. ఎదురు ప్రశ్నిస్తే ఐటీ, ఈడీలతో దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

moidi 09022019 2

బీజేపీ సభకు మనుషులు రారు కాబట్టి.. వైసీపీ నేతలు జనసమీకరణ చేశారని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం ఎలాంటి దాడులు చేసినా తాము భయపడేది లేదని, జగన్‌ భయపడుతారన్నారు. రాజధానికి డబ్బులు ఇవ్వరని, పోలవరానికి ఇంకా రూ. 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, వెనుకబడిన ప్రాంతాలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. తాము మోదీకి ఊడిగం చేయడం లేదు కాబట్టే నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఊడిగం చేయడానికి తాము కేంద్రానికి బానిసలం కాదన్నారు. తనపై నమ్మకంతో రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని సీఎం స్పష్టం చేశారు. రైతులకు ఉన్న స్ఫూర్తి ఈ ప్రధానికి లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

moidi 09022019 3

గతంలో తనపై మోదీకి ఉన్న నమ్మకం ఇప్పుడు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇవ్వడం చేతకాక తనను విమర్శిస్తున్నారని అన్నారు. విభజన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని చంద్రబాబు, మోదీని సూటిగా ప్రశ్నించారు. మన గడ్డపైకి వచ్చిన ప్రధాని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. మోదీ ఒక ప్రచార ప్రధాన మంత్రి అని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని, మన గ్యాస్‌ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల ఎవరికైనా లాభం జరిగిందా? అని ప్రశ్నించారు. నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్‌ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read