నాది 56 అంగుళాల ఛాతీ... నా దమ్ముతో దేశాన్ని నిలబెడతా అని చెప్తున్న ప్రధాని మోడీ, అదే దేశంలో, 5 కోట్ల మంది ఆంధ్రులు ఉన్న సంగతి మర్చిపోయారు. మర్చిపోవటం కూడా కాదేమో, అహంభావంతో, మన మీద చులకనతనం.. నిన్న అవిశ్వాసం పెట్టింది ఎందుకు ? ఈ దేశంలోని ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉన్న, 5 కోట్ల మందిని ప్రధాని ముంచేశారు అని. నిన్న జయదేవ్ కాని, రాంమోహన్ నాయుడు కాని, ఏమి మాట్లడారు ? లేకపోతే వాళ్ళు మాట్లాడింది, మోడీకి అర్ధం కాలేదా ? దాదాపు ఇద్దరూ కలిసి గంటకు పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం చెప్పారు. ఎక్కడా రాజకీయం చెయ్యలేదు. మోడీ ఏమి చెప్పారు, చట్టంలో ఏమి ఉంది, ఇప్పుడు ఎనుకు అమలు చెయ్యటం లేదు అనే అడిగారు. దాదాపు విభాజన చట్టంలో 18 అంశాలతో పాటు, మిగిలిన హామీల పై నిలదీశారు..

modi 21072018 2

మరి అవిశ్వాసం పెట్టిన సందర్భం తగ్గట్టు మన ప్రధాని మాట్లాడాలి కదా ? 5 కోట్ల మంది ప్రజలు నా పట్ల ఎందుకు విశ్వాసంతో లేరు ? నేను ఏమి చేసాను, ఏమి చేస్తానో చెప్పాలి కదా ? ప్రధాని మాత్రం అవేమి చెప్పలేదు. రెండు గంటలు మాట్లాడి, కొన్ని సినిమా పెర్ఫార్మన్స్ లు ఇచ్చి, మన రాష్ట్రం గురించి రెండే రెండు నిమషాలు మాట్లడారు. అది కూడా రాజకీయ ప్రసంగం. ఇది తెలుగుదేశం పార్టీకి, కేంద్రానికి సంబంధించినది కాదు, అని మన ఘనత వహించిన ప్రధాని గారికి తెలియదు అంటే ఆశ్చర్యం కలుగుతుంది ఏమో. నిన్న జరిగింది, 5 కోట్ల మందికి, ప్రధాని మీద విశ్వాసం పోవటం. అది వదిలేసి, మన రాష్ట్రం గురించి మాట్లాడిన రెండు ముక్కలు, రాజకీయ కోణంలో మాట్లడారు.

modi 21072018 3

స్పెషల్ స్టేటస్ కు లింక్ పెట్టి రాజకీయం చేసారు. చంద్రబాబుకి ఫోన్ చేసాను, మీరు జగన్ ట్రాప్ లో పడ్డారు అని అన్నారు. కెసిఆర్ చాలా హుందాగా ఉన్నారు, చంద్రబాబు అలా లేరు అన్నారు. కేవలం రాజాకీయ కోణంలోనే చంద్రబాబు ఇలా చేసారు అన్నారు. చంద్రబాబుకి రాజకీయ సమాధానం చెప్పారు సరే, మరి 5 కోట్ల మందికి ప్రధాని ఏమి చెప్పారు ? పోలవరం, రెవెన్యూ లోటు భర్తీ, ఆస్తుల విభజన, విద్యాసంస్థలకు తగిన స్థాయిలో నిధుల విడుదల, విశాఖకు రైల్వే జోన్‌, కడప ఉక్కు కర్మాగారం... ఇలా అనేక సమస్యలున్నప్పటికీ దేనినీ ప్రధాని ప్రస్తావించలేదు. ‘హోదా ఇవ్వలేక పోయాం. ప్యాకేజీ ఇచ్చాం. రాజధాని పనులకు తోడ్పాడు అందిస్తాం’ అనే మాట మాత్రమే చెప్పారు. ప్రధాని హోదాలో ఉండి, రాష్ట్ర సమస్యలు ప్రస్తావించకుండా, మన ప్రధాని రాజకీయ ప్రసంగం ఇది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read