వైసీపీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. రోజూ ఉండే కోర్టు మొట్టికాయలకు తోడు షాకింగ్ నిర్ణయాలు వెలువరిస్తూ కేంద్రం బంతాట ఆరంభించింది. 2015లోనే అమరావతిని రాజధానిగా నోటిఫై చేశామంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. మూడు రాజధానులని ఊదరగొడుతున్న వైసీపీ ఆ విషయమే కేంద్రానికి తెలియజేయలేదని మరో బాంబు పేల్చింది. త్వరలోనే విశాఖ నుంచి పాలన ఆరంభిస్తారని, సీఎం జగన్ ఇల్లు కోసం వెతుకుతున్నారని రోజుకొక వార్త మోసుకొస్తున్న వైసీపీకి కేంద్రం అఫిడవిట్లో అంశాలు శరాఘాతంలా తగిలాయి. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే వైసీపీ సర్కారు కోసం సర్వీస్ రూల్స్‌నే పక్కనబెట్టిన డిజి సునీల్ కుమార్ పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికపై పీవీ సునీల్‍కుమార్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని కేంద్రానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుపై ఈ చర్యలకి దిగింది కేంద్రం. ఎంపీ రఘురామ ఫిర్యాదుతో పాటు డీవోపీటీ లేఖను ఏపీ సీఎస్‍కు పంపిన కేంద్రహోంశాఖ పంపడంతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇటీవలే వివేకానందరెడ్డి కేసుని పక్కరాష్ట్రాలకు బదిలీ చేయడం ద్వారా జగన్ సర్కారుకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలా అండదండలు అందిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం వరస చర్యలతో సంథింగ్ ఫిషీ అని పొలిటికల్ సర్కిళ్లలో చర్చలు సాగుతున్నాయి. వైసీపీ పని అయిపోయిందని సర్వేలే తేల్చేస్తుండడంతో కేంద్రంలో బీజేపీ స్ట్రాటజీ మార్చినట్టు కనపడుతోంది
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ..కేంద్రంలో బీజేపీ హ్యాండ్ ఇస్తోందా?
Advertisements