ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టుల్లోనే కాదు, కేంద్రం వద్ద, గవర్నర్ వద్ద కూడా బిల్లులు ఆగిపోతున్నాయి. బిల్లులు చట్టబద్ధంగా ఉండటం లేదు అంటూ, కొందరు కోర్టుకు వస్తుంటే, కోర్టు వాటిని పరిశీలించి, చట్ట విరుద్ధంగా ఉంది అని నమ్మితే, వాటికి బ్రేకులు వేస్తుంది. అయితే కోర్టులు తమ పై కక్ష కట్టారు అని ప్రచారం చేసారు. అయితే కోర్టు పరిశీలనకు వెళ్ళని బిల్లులు కొన్ని, చట్టానికి లోబడి లేకపోతే గవర్నర్ వద్ద కానీ, కేంద్రం వద్ద కానీ బ్రేక్ పడుతుంది. గత వారం గవర్నర్ వీసి నియామక ఫైల్స్ ని వెనక్కు పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం కూడా బిల్లుని వెనక్కు పంపి రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. ఇప్పటికే దిశా బిల్లుని మూడు సార్లు వెనక్కు పంపిన కేంద్రం, ఇప్పుడు మరో బిల్లు విషయంలో కూడా ఇదే చేసింది. జగన్ ప్రభుత్వం, ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు-2019 అనే బిల్లుని తీసుకు వచ్చి, దాన్ని శాసనసభలో ఆమోదించి, గవర్నర్ వద్దకు పంపి, అక్కడ కూడా ఆమోదించుకుని, రాష్ట్రపతి వద్దకు ఫైల్ పంపించింది. అయితే ఈ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్ళకుండానే, కేంద్రం వద్దే ఆగిపోయింది. కేంద్ర చట్టాలు కాలరాసే విధంగా ఈ బిల్లు ఉంది అంటూ కేంద్రం అభ్యంతరం చెప్పింది. కేంద్ర చట్టాలను ఉల్లంఘించే విధంగా, ఈ చట్టం ఎలా రూపొందించారు అంటూ, కేంద్ర హోం శాఖ కొంచెం ఘాటుగానే అధికారులను ప్రశ్నించినట్టు తెలుస్తుంది.

jagan 26112020 2

ఏకంగా సివిల్ కోర్టు అధికారాలు రద్దు చేస్తూ ఎలా చట్టం చేస్తారు అంటూ, కొన్ని ప్రశ్నలు వేసి, వాటికి సమాధనం చెప్పాలి అంటూ రాష్ట్ర అధికారులను కోరింది. వీటి పై ఇటీవల అధికారులు సమాధానాలు ఇచ్చినా, కేంద్రం వాటికి సంతృప్తి పడలేదని, తమ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని, బిల్లులలోని కొన్ని క్లాజులు పూర్తిగా మార్చలాని, అప్పుడే బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దాదాపుగా 16 నెలలు తరువాత బిల్లు వెనక్కు రావటంతో ఏపి ప్రభుత్వం షాక్ అయ్యింది. మొదటి అసెంబ్లీ సెషన్ లోనే బిల్లు అసెంబ్లీలో ఆమోదించినా, ఇప్పటి వరకు కేంద్రం ఆమోదించకుండా, ఇప్పుడు తిప్పి పంపింది. అయితే ఇప్పుడు మళ్ళీ క్లాజులు అన్నీ మార్చి, మళ్ళీ సవరించిన బిల్లు అసెంబ్లీ, శాసనమండలి ఆమోదం పొందాలి. ఇక్కడ అయిన తరువాత, మళ్ళీ గవర్నర్ ఆమోదం పొందిన తరువాత, కేంద్రం వద్దకు మళ్ళీ వెళ్ళాలి. బిల్లు రూపొందించిన సమయంలోనే, తగు జాగ్రత్తలు, తగు న్యాయ సలహాలు తీసుకుని ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read