మొన్నటి దాక మొరుమోగిన అమరావతి పేరు, ఇప్పుడు సోయలో కూడా లేకుండా పోతుంది. మొన్నటి దాకా కేంద్రం నిధులు ఇవ్వకపోయినా, చంద్రబాబు కిందా మీదా పడి, ఆంధ్రుల కోసం, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పరుగులు పెట్టించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, మొత్తం తారు మారు అయ్యింది. కేంద్రం ఎలాగూ పట్టించుకోవటం లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా, అమరావతిని పక్కన పడేసింది. ఈ రోజు విడుదలైన కేంద్ర బడ్జెట్ లో, విభజన చట్టం ప్రకారం రాజధానికి ఇవ్వాల్సిన కేటాయింపులు పైసా కూడా లేదు. ఇక వచ్చే వారం వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో కూడా అమరావతికి నిధుల కేటాయింపు ఉండదు అని ఇప్పటికే సంకేతాలు వచ్చయి. దీంతో ఇప్పుడు, అమరావతి నిర్మాణంపై దాదాపు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే గత 40 రోజుల నుంచి అమరావతి నిర్మాణం ఎక్కడికక్కడ ఆగిపోయింది. 40 వేల మంది కూలీలతో ఎప్పుడూ సందడిగా ఉండే అమరావతి నిర్మాణ ప్రదేశం, నేడు ఎవరూ లేక నిర్మానుషంగా తయారయ్యింది.

చంద్రబాబు ప్రభుత్వం, అమరావతి నిర్మాణానికి, 1.09 లక్ష కోట్ల రూపాయల అంచనాతా, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని ప్రణాలికలు రచించింది. అమరావతిలో వివిధ కట్టడాలకు 62 వేల కోట్ల రూపాయల పనులు చేసందుకు ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సమయానికి దాదాపు 40 వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి. అలాగే మరో 4200 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచే పనిలో ఉన్నారు. మరో 7600 కోట్ల రూపాయల పనులు డీపీఆర్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ దశలో వచ్చిన జగన్, అన్ని పనులు ఆపేశారు. మొన్న సమీక్ష చేసి, అమరావతి అంతా స్కాం అని, అక్కడ అవినీతి బయటకు తీసే వరకు, పనులు ఏమి జరగవ్ అని చెప్పారు. అయితే కేంద్రం అయినా ఏమైనా నిధులు ఇస్తుందని అందరూ భావించారు. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో, అమరావతి అనే ఊసే లేదు. అటు మోడీ, ఇటు జగన్ కలిసి, అమరావతిని పక్కన పడేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read