గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తన దుస్తులు తానే ఉతుక్కున్నానని బుధవారం జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. అయితే ఇది పూర్తిగా అవాస్తమని నెటిజెన్లు మండిపడుతున్నారు. మోదీ అబద్దాలు చెబుతున్నారని కొన్ని సాక్ష్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మోదీని బుధవారం బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తన దుస్తులు తానే ఉతుక్కున్నానని మోదీ అన్నారు. దీనిపై నెటిజెన్లు విపరీతంగా మండిపడుతున్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్దాలు చెప్పడమేంటని, ఇదంతా ఎన్నికల గిమిక్కని విమర్శలు గుప్పిస్తున్నారు.
మోదీ.. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. అయితే 1970ల్లో.. నరేంద్రమోదీ ఆర్‌ఎస్ఎస్ ప్రచారక్‌గా నుంచే చాంద్ మహ్మద్ అనే వ్యక్తి మోదీ దుస్తులు ఉతుకుతూ వచ్చారు. అతడు ఈ మధ్యే మరణించారు. అంటే మోదీ ముఖ్యమంత్రి కాకముందు మూడు దశాబ్దాల క్రితం నుంచే ఆయన దుస్తులు వేరే వారు ఉతికేవారనే విషయం స్పష్టమవుతోందని నెటిజెన్లు మండిపడుతున్నారు. ఇది ఒక్కటే కాదు ఒబామా నాకు మంచి స్నేహితుడు అని, మాకు మంచి రిలేషన్ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. కాని ఒక ఇంటర్వ్యూ లో మోడీ గురించి అభిప్రాయం అడగ్గా, ఒబామా మోడీ గురించి చెప్పకుండా, మన్మోహన్ గురించి చెప్పిన వీడియో క్లిప్ కూడా వైరల్ అవుతుంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడు దశల్లో పోలింగ్ కంప్లీట్ అయింది. ఇంకా నాలుగు దశల్లో పోలింగ్ జరగాలి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి సడెన్‌గా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.అసలు ఒక నటుడికి మోదీ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చాడనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల వేళ పీఎం మోదీ ..తన జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్ విడుదలకు ఈసీ బ్రేకులు వేసింది. దీంతో తన గురించి ప్రజలకు చేరాలనుకున్న విషయాలు సరిగా చేరలేకపోయింది. అదే సమయంలో ప్రధాని జీవితంపై వెబ్ సిరీస్‌ను కూడా సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. మరోవైపు కొంత మంది నటీనటులు మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే చరిత్రలో ఒక విలేఖరికి కాకుండా అక్షయ్ కుమార్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోకు ఇంటర్వ్యూ ఇవ్వడం వెనక పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.