లోకేష్ నామం జపించడానికి ఢిల్లీ నుండి గుంటూరు వచ్చిన భారత ప్రధాని. అవును మీరు వింటుంది నిజం. ఇంతమంది నిరసనల మధ్య వచ్చి ఆంధ్రాకి ఏమైనా హామీ ఇచ్చారా, ఏమైనా ప్రకటన చేశారా, లేదు..చంద్రబాబు, లోకేష్ మీద విమర్శలు చేయడానికైతే..ఒక ప్రెస్ మీట్ పెడితే సరిపోయేది..ఇంత వృధా ప్రయాస ఎందుకు.. లోకేష్ మీద పడి ఏడవడానికి సూటు బూటు వేసుకొని అమరావతి రావలా ? లోకేష్ నామస్మరణ చేసిన జగన్, పవన్ ల తో పాటు, ఆ లిస్ట్ లో మోడీ కూడా చేరిపోయాడు. అవార్డులు ఇచ్చి, ఇచ్చి లోకేష్ అభిమాని గా మారిపోయిన మోడీ! లోకేష్‌గారి తండ్రిగారంటూ చంద్రబాబుపై పదేపదే వెక్కిరింపు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కొత్త హామీలు గానీ, ప్రకటనలుగానీ చేయలేదు.
విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ లాంటి అంశాలు ఏవీ మోదీ ప్రస్తావించలేదు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే.. గతంలో చంద్రబాబు ఒప్పుకున్నారంటూ ప్రధాని పాత క్యాసెట్టే తిరగవేశారు. మోదీ గోబ్యాక్ లాంటి నిరసనలపై ప్రధాని వెటకారాలు చేశారు. ఏపీ పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏపీకి కొత్త భరోసా ఏమైనా ఇస్తారా అనే.. అంచనాలను మోదీ ప్రసంగం అందుకోలేకపోయింది. ఏపీకి చాలా ఇచ్చామని, ఇంకా ఇస్తాం అనే మాట మాత్రమే చెప్పిన మోదీ.. రేపు ఢిల్లీలో చంద్రబాబు తలపెట్టిన దీక్షపైనా విమర్శలు చేశారు.
ఒకసారి బాబు అని, మరొకసారి లోకేష్ తండ్రి అని ఆయన చేసిన సంబోధనేమిటో ప్రజలకు అర్ధం కావటం లేదు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రధానాంశం రాష్ట్రనికి ప్రత్యేక హోదా డిమాండ్ అంశాన్ని ప్రస్తావిoచకుండా, బిజెపి నేతలు తరచూ పాడే పాత పాట “ప్రత్యేక ప్యాకేజీ పాటను” మోడీ మరోసారి పాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అదనపు నిధులు కేటాయిoపు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ ఊసెత్తని ప్రధాని, గుంటూరుకు ఎందుకోచ్చారో మరి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎద్దేవా చేసేవిధంగా సాగిన ప్రధాని ఉపన్యాసాన్ని ప్రజలు చీత్కరిoచుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ కి 5 లక్షల కోట్లు ఇచ్చామని ఇటీవల అమిత్ షా చెప్పారని, మోడీ ఏమో 3 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పుకున్నారు. వారి ప్రకటనల వ్యత్యాసం ఏమిటో మోదినే చెప్పాలి.