కేంద్రమంత్రివర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు.. కేంద్రమంత్రి అయినా, కోట్లకు అధిపతి అయినా.. సామాన్య జీవితం గడుపుతూ అందరికీ ఆదర్శం... 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో, ఒక చిన్న మచ్చ కూడా లేని జంటిల్ మెన్ ఆయన... ఈ మధ్య కొంత మంది, స్థాయిలేని వాళ్ళు ఆయనను సోషల్ మీడియాలో ఎలా టార్గెట్ చేసారో చూశాం... తాజాగా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆశోక్ గజపతిరాజును ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రులకు సూచించారు. ఎంతో శ్రీమంతుడైన అశోక్ కేంద్రమంత్రి కాకమునుపు విజయనగరంలో అప్పుడప్పుడూ చిన్న నానో కారులో స్వయంగా డ్రైవింగు చేసుకుంటూ కనిపించేవారు. కావాలంటే కోట్లు విలువ చేసే విదేశీ కార్లు ఎన్ని కావాలంటే అన్ని కొనుగోలు చేయగలిగే ఆయన ఎంతో నిరాడంబరంగా తానే స్వయంగా నానో కారు నడుపుతూ షాపింగ్ చేసేవారు.
కేంద్ర మంత్రిగా ఆశోక్‌గజపతిరాజుకు ప్రభుత్వం అనేక అనేక వెసులుబాట్లు కల్పించింది. తాను ఎక్కాల్సిన విమానం వద్దకు నేరుగా ప్రత్యేక వాహనంలో వెళ్లవచ్చు. తనిఖీలు లేకుండానే విమానాశ్రయంలోకి వెళ్లవచ్చు. కానీ ఆయన అలా చేయరు. అందరు ప్రయాణికులతోపాటు వరుసలో నిలబడతారు. రెండు చేతులు పైకెత్తి చెకింగ్ చేయించుకుంటారు. మీ డ్యూటీ మీరు చేయండి, తప్పులేదంటూ సెక్యూరిటీ సిబ్బందికి సూచిస్తారు మంత్రి. విమానాశ్రయానికి కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజు మెట్రో రైలులో ప్రయాణిస్తారు. మిగిలిన ప్రయాణికులతోపాటు క్యూలో నిల్చుని... మెట్రో కార్డు (టికెట్) పంచ్ చేయించుకుని గేటు దాటి వెళతారు. ఈ తరహ వ్యక్తిత్వం ఉన్న ఆశోక్‌గజపతిరాజుకు మోడీ వద్ద ప్రత్యేక మార్కులు పడ్డాయి. ఆశోక్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన మంత్రివర్గసహచరులకు సూచించారు. ఆశోక్‌గజపతిరాజు సింప్లిసిటీని అందరూ అనుసరిస్తే బాగుంటుందని మోడీ అప్పుడప్పుడు తన సహచరులకు చెబుతుంటారు.
రాజకీయాల్లో అవినీతి మకిలి అంటని నేతల్లో అశోక్ గజపతి రాజు గారు ఒకరు... లక్షల కోట్లకు అధిపతి అయిన ఈ రాజుగారి వంశపారంపర్య ఆస్తులు విద్యాసంస్థలు - బ్యాంకులు - ఆస్పత్రులకు ఇచ్చారు. ఇంకా వేలాది ఎకరాలు ట్రస్టు పేరుతో ఖాళీగా ఉన్నాయి. అదే ఇంకెవరైనా అయితే - అందులో భవంతులు నిర్మించో - ఇంకొకటో ఇంకొకటో చేసో ఆస్తులు పెంచుకునేవారు. కానీ అశోక్ కుటుంబం మాత్రం ఉన్నది చాల్లే అనుకుంటూ సంతృప్తిగా ఉంటారు. గతంలో రాష్ట్రంలో రెవెన్యూ - ఆర్థిక శాఖలు వంటి కీలక శాఖలు నిర్వహించినా ఏ రోజూ ఎవరూ పల్లెత్తు ఆరోపణ చేయలేదు. అంతెందుకు..... సొంత జిల్లా విజయనగరంలో ఆయన రాజకీయ ప్రత్యర్థయిన బొత్స సత్యనారాయణ కూడా అశోక్ పై ఏనాడూ ఒక్క రూపాయి తిన్నారని అనలేదు. అలాంటి క్లీన్ ఇమేజి అశోక్ ది...