అశోక్ గజపతిరాజు... విజయనగర రాజ వంశం.. అయినా, ఏ నాడు రాజదర్పం చూపించలేదు... సామాన్యులతో కలిసి మెలిసి, అతి సాధారణ జీవితం అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంలో పౌరవిమానయాన మంత్రిగా మూడున్నరేళ్లకు పైగా పనిచేశారు... అధినేత చంద్రబాబు సూచనల మేరకు, మారు మాట్లాడకుండా, మంత్రి పదివికి రాజీనామా చేసారు... అయితే, ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ చాలా కీలకమైనది... ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో చేతిలోకి తీసుకున్న రాజు గారు, ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వహించారు... ఎంతో లాబయింగ్ ఉన్న శాఖలో, రూపాయి కూడా అవినీతి ఆరోపణలు రాలేదు.. ఇప్పుడు రాజీనామా చెయ్యటంతో, పౌరవిమానయాన శాఖకు కొత్త మంత్రిని తీసుకోవాల్సిన పరిస్థితి...
అయితే ప్రధాని మోడీకి, అశోక్ గజపతిరాజుకి మించిన సమర్ధుడు, నిజాయితీ పరుడు లేరు అనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది... ఈ శాఖలో అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, అందుకే ఎవరినీ నామ్మని మోడీ, పౌరవిమానయాన శాఖకు కొత్త మంత్రిని నియమించకుండా, తన వద్దనే ఉంచుకున్నారు...పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు, ఈ శాఖ బాధ్యతలు పూర్తిగా అప్పగిస్తారు అనే వార్తలు వచ్చినా, మోడీ మాత్రం ఈ శాఖకు ఉన్న ప్రాముఖ్యత, రాజు గారి సమర్ధతకు మ్యాచ్ అయ్యేవారు దొరక్కపోవటంతో, తన వద్దే ఈ శాఖను ఉంచుకున్నారు..
స్వదేశీ పౌరవిమానయాన మార్కెట్‌లో 2014లో భారత్ స్థానం 9 కాగా.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌గా గుర్తింపు పొందింది. స్వాతంత్య్రం వచ్చాక 70 ఏళ్లను తరచిచూస్తే కేవలం 70 పనిచేసే విమానాశ్రయాలు మాత్రమే ఉండగా.. ఏడాదిలో 80 అదనపు విమానాశ్రయాలను పునరుద్ధరించడమే గాక.. మరో 500 కొత్త ప్రాంతీయ మార్గాలను ప్రవేశపెట్టడంలో ఆయనదే కీలక పాత్ర...అన్నిటికన్నా ప్రధానిని ఆకర్షించింది ఆయన సంస్కరణాభిలాష. ఎయిరిండియాలో, పౌరవిమానయాన రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇందుకు మోదీ వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన హయాంలోనే ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు భారతదేశంలో బాధ్యతలు నిర్వర్తించడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పుకోదగ్గ విషయం... అలాగే సొంత పార్టీ వారైనా, మిత్రపక్షం ఎంపీలైనా విమాన సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తే ఎక్కడా రాజీపడలేదు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఉదంతాలే వీటికి ఉదాహరణ..