నేను కావాలనే ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేయిస్తున్నానని కొంతమంది విమర్శిస్తున్నారు.. కావాలంటే నా ఇంట్లో కూడా సోదాలు చేయమనండి అన్నారు ప్రధాని మోదీ. వారణాసిలో నామినేషన్ వేసిన అనంతరం భారీ రోడ్‌ షోలో పాల్గొన్నారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ‌కీయ క‌క్ష‌తో నేత‌ల ఇండ్ల‌పై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం లేద‌ని, చ‌ట్టం ప్ర‌కార‌మే ఆ సోదాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. నేను ఏదైనా తప్పు చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నా ఇంట్లోనూ దాడులు చేస్తుందని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్లు తప్పులు చేస్తున్నారేమో.. అందుకే భయపడి ఇలా విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే రాఫెల్ పై ఎందుకు విచారణ చేయ్యనివ్వటం లేదో, మోడీకే తెలియాలి.

modi 26042019

అలాగే ఈవీఎంల పై కూడా మాట్లాడారు. జరుగుతున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించకుండ, అర్ధరాత్రి దాక ప్రజలు ఓటింగ్ లో పాల్గున్న విషయం చెప్పకుండా, రాజకీయం చేసారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్యంపై ప్రతిపక్షాలు చేస్తున్నది యాగీ అంటూ మోదీ తప్పుపట్టారు. మోదీని తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్న విపక్షాలు నిన్నటి నుంచి ఈవీఎంలను తప్పుపడుతున్నాయని ఎన్నికల ర్యాలీలో ప్రధాని అన్నారు. దీనిని బట్టి చూస్తే వారు తమ ఓటమిని ఈవీఎంలపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. ఇది.. పరీక్షలు బాగా రాయని విద్యార్థి ఇంటికి తిరిగివచ్చి తనకు మంచి పెన్ను లేదని, పేపర్ నాణ్యత అస్సలు బాగోలేదని వంకలు పెట్టినట్టు ఉందన్నారు. 'మూడు విడతల పోలింగ్ పూర్తవడంతో విపక్షాలు ఓటమిని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది' అని అన్నారు.

modi 26042019

దేశంలో ఉగ్రవాదం బెడదను కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయిందని ప్రధాని విమర్శించారు. శ్రీలంకంలో ఈస్టర్ పండుగనాడు ఉగ్రవాదులు చర్చిలు లక్ష్యంగా దాడులు చేయడం అందరికీ తెలుసునని, 2014 ముందు ఇండియాలోనూ అలాంటి పరిస్థితే ఉండేదని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ భయపడిపోయేదని అన్నారు. 'దేశానికి సేవ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు. కాంగ్రెస్ సొంత కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఆ కుటుంబానికే కట్టుబడి ఉంటుంది. మిగతా వాళ్లను ఆ పార్టీకి ఓటు బ్యాంకుగానే చూస్తారు' అని విమర్శించారు. బాలాకోట్ దాడులను ప్రస్తావిస్తూ, తాము ఏదైనా చేస్తే మోదీ నరకం చూపిస్తారనే విషయం టెర్రరిస్టులకు బాగా తెలుసునని అన్నారు. అయితే సైన్యం విషయం ఎన్నికల ప్రచారంలో మాట్లాడవద్దు అని ఈసీ చెప్పినా, మోడీ మాత్రం అదే ప్రచారం చేసుకుంటున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read