ఇన్నాళ్ళు తమకు విపక్షమే లేదని, రాహుల్ గాంధి అసలు పోటీనే కాదని, విర్రవీగిన ఢిల్లీ పెద్దలకు, చంద్రబాబు రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేసి షాక్ ఇచ్చి వచ్చారు. దాదపుగా 15 విపక్ష పార్టీలను ఒక్కతాటి పైకి తీసుకువచ్చారు. మాయవతితో గేమ్ ఆడిద్దాం అనుకున్న అమిత్ షా వ్యూహానికి, చంద్రబాబు చెక్ పెట్టారు. కేవలం రెండు సార్లు ఢిల్లీ వెళ్లి, ఈ పనులు అన్నీ చక్కబెట్టుకుని వచ్చారు. ఇప్పుడు తరువాత స్టెప్ కూటమి ఆఫిషయల్ గా అనౌన్స్ చెయ్యటం. ఒక్కసారి ఇది జరిగిన తరువాత, ఇక మోడీ-షా లకు చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ ఉంది రాహుల్ గాంధి కాదు, చంద్రబాబు.
యునైటెడ్ ఫ్రంట్ దగ్గర నుంచి వాజ్ పాయి ఎన్డీఏ దాకా, చంద్రబాబు పాత్ర ఏమిటో, కూటమి కట్టి చంద్రబాబు ఏమి చెయ్యగలరో, మోడ-షా లకు బాగా తెలుసు. అటు లెఫ్ట్ పార్టీ లను, ఇటు రైట్ పార్టీలను ఒకే తాటి పాటి ఉంచే శక్తి చంద్రబాబుకి మాత్రమే ఉందనేది అందిరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీలో చూపిస్తున్న చొరవ, టాక్ అఫ్ ది నేషన్ అయ్యింది. దీంతో, ఈ విషయం పై, మోడీ స్పందించారు. కేవలం తమ కుమారులకు అధికారం కట్టబెట్టడం కోసమే కొన్ని విపక్షాలు ఒక్కటవుతున్నాయి తప్ప సిద్ధాంతపరమైన సారూప్యతతో కాదని మోడీ అన్నారు. మోదీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు, రాహుల్ చేతులు కలపడం, 15 పార్టీలతో జాతీయ ఫ్రంట్ ఏర్పరచనున్నట్లు ప్రకటించడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఎవరి పేరూ ఎత్తకుండా ఆయన తొలిసారిగా ఈ జాతీయ ఫ్రంట్‌పై స్పందించారు. అనువంశిక పాలన పేరుతో రాహుల్, చంద్రబాబులిద్దరినీ ఆయన టార్గెట్ చేశారు. ఐదు లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.‘‘ఏకే-47 పేల్చినపుడు బుల్లెట్లు శరపరంపరగా బయటకొస్తాయి. అదే రీతిన అబద్ధాలను పేలుస్తున్నారు. విపక్షాలు కావవి..అబద్ధాలు వెళ్లగక్కే యంత్రాలు’’ అని ప్రధాని విరుచుకుపడ్డారు. అయితే, చంద్రబాబు, రాహుల్ కలియికలో, వాళ్ళు ప్రధానంగా చెప్పింది, వ్యవస్తులు నాశనం అవుతున్నాయని, సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి ఆర్బీఐ దాకా, మోడీ చేస్తున్న చేతకాని పాలన్ని విమర్శ చేస్తే, మోడీ మాత్రం, ఆ విషయం పై స్పందించకుండా, ఏపి విభజన హామీల పై చంద్రబాబు తిరగబడితే, ఆ విషయం పై స్పందించకుండా, తనకు బాగా వచ్చిన ఆక్టింగ్ తో మాయ చేస్తున్నారు.