1983... అప్పటి ఢిల్లీ పీఠం పై ఉన్నది కాంగ్రెస్ పార్టీ.. అడుగడుగా, తన అహంకారంతో, తెలుగు వారిని అనేక అవమానాలు గురి చేసారు. తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆడుకున్నారు. అది చూసి తట్టుకోలేక, ఢిల్లీ మదం అణచటానికి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అప్పటి ఢిల్లీ అహంకారులకు, తెలుగు వాడి ఆత్మగౌరవం దెబ్బ తింటే ఎలా ఉంటుందో చూపించారు. అప్పటి పవర్ఫుల్ లీడర్ గా ఉన్న ఇందిరా గాంధీ కూడా, ఎన్టీఆర్ తెగువకు తల వంచాల్సి వచ్చింది. అది గతం.. ఇప్పుడు వర్తమానం. అదే ఢిల్లీ పై మరో అహంకారి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ.. అంతే తేడా..
మరి ఢిల్లీ అహంకారానికి నిరసనగా పుట్టిన పార్టీ ఏమి చెయ్యాలి ? ఆ అహంకారిని డీ కొట్టాలా, లేదా ? తెలుగు వారిని నమ్మించి మోసం చేసిన వాళ్ళని, వదిలి పెట్టాలా ? వారికి తగిన గుణపాఠం చెప్పాలి కదా ? ఇప్పుడు చంద్రబాబు అదే చేసారు. అప్పుడు ఎన్టీఆర్, ఢిల్లీ అహంకారుల పై ఎలా పోరాడారో, ఇప్పుడు ఉన్న ఢిల్లీ అహంకారుల పై, అలాగే చంద్రబాబు ఎదురు తిరుగుతున్నారు. ఏపిని విడగొట్టి, ఇచ్చిన హామీలు అమలపరచకుండా, 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా, కనీసం లెక్క చెయ్యకుండా, పక్క రాష్ట్రాలకు నిధులు గుమ్మరిస్తూ, ఏపిని అణగదొక్కాలి అని చూస్తుంటే, ఎన్టీఆర్ స్పూర్తితోనే, ఢిల్లీ పై చంద్రబాబు యుద్ధం ప్రకటించారు. నరేంద్ర మోడీ చర్యలతో దేశంలో అన్ని వ్యవస్థలు నాశనం అవ్వుతుంటే, అన్ని పార్టీలను కలుపుకుని, పోరాటం చేస్తున్నారు.
అయితే, ఎమోషన్ బాగా పండించి, తాను ఏ పని చెయ్యకపోయినా సరిపోతుందని, ప్రజలను పిచ్చోళ్లని చేసే మన ప్రధాని మోడీ గారు, ఈ విషయం పై ఈ రోజు స్పందించారు. తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మోదీ ఆదివారం మాట్లాడుతూ, తెలుగు ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ ఎన్ టీ రామారావు పోరాడారని, తెలుగుదేశం పార్టీ మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని, ఆ పార్టీని కాంగ్రెస్ దాష్టీకాలకు వ్యతిరేకంగా స్వర్గీయ ఎన్ టీ రామారావు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే మోడీ గారి మాటలు చూస్తుంటే బలే నవ్వు వస్తుంది. ఇలాంటి ఎమోషన్ ఎక్కడైనా పండుద్ది కాని, మా ఆంధ్రాలో కుదరదు మోడీ గారు. అప్పుడు కాంగ్రెస్ అయితే, ఇప్పుడు మీరు. మీరు చెప్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు కనుక బ్రతికి ఉంటే, మీరు చేస్తున్న పనులకు ఏమి చేసేవారో తెలుసా ? ఏపి హామీలు అమలపరచుకుండా, మమ్మల్ని నమ్మించి, మోసం చేస్తుంటే, ఏమి చేసేవారో తెలుసా ? ఎన్టీఆర్, చంద్రబాబు అంత మంచి వాడు కాదు. చంద్రబాబులాగా ఆచితూచి పని చెయ్యరు, ఆయన పేరు వాడి, ప్రజల్లో ఎదో ఎమోషన్ తేవాలని అనుకోకండి. చంద్రబాబు కాబట్టి మీ చర్యలు తట్టుకుంటూ 3.5 ఏళ్ళు ఆగారు, అదే ఎన్టీఆర్ అయితే, మొదటి సంవత్సరమే, మీకు పట్టపగలే చుక్కలు చూపించేవారు. తెలుగువాడి ఆత్మగౌరవం ముందు, మీ ఎమోషన్ డ్రామాలు పని చెయ్యవు సార్. ఇలాంటి ఎమోషన్ డ్రామాలు కాకుండా, ఈ నాలుగు నెలలు అయినా, కొంచెం సామాన్యుల పై కనికరం చూపండి.