ఈ రోజు జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, "క-రో-నాపై భారతీయుల పోరాటం కొనసాగుతోంది – ఇలాంటి కష్టం గురించి గతంలో మనం ఎప్పుడూ వినలేదు – వందేళ్లలో ఇది అతిపెద్ద ఉపద్రవం – ప్రపంచ దేశాలతోపాటు భారత్ కూడా ఎంతో నష్టపోయింది – మనకు ఎంతో ఆప్తులైనవారిని కోల్పోయాం – దేశ చరిత్రలో ఇంతటి మెడికల్ ఆక్సిజన్ ఎప్పుడూ అవసరం పడలేదు – అతి తక్కువ సమయంలోనే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాం – క-రో-నా అత్యంత దారుణ మహమ్మారి – కో-వి-డ్ పై పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది – దేశ ప్రజలు ఎన్నో బాధలను అనుభవించారు – ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోర విషాదం – వైద్య, మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచాం – ఆక్సిజన్ కోసం సైనిక దళాలు కూడా పనిచేశాయి – విమానాలు, రైళ్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేశాం – వ్యాక్సిన్ తయారీ కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి – సెకండ్ వేవ్ లో ప్రజలు ఎంతో బాధను అనుభవించారు – క-రో-నా-ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒకటే ఆయుధం – రెండు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లను ప్రారంభించాం – యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం – మనం వ్యాక్సిన్ తయారు చేసుకోకపోతే విదేశాల నుంచి రావడానికి ఏళ్లు పట్టేది – వాళ్ల అవసరాలు తీరాక మనకు ఇచ్చేవారు – వ్యాక్సినేషన్ సామర్థ్యం 60 నుంచి 90 శాతానికి పెంపు – ఇప్పటి వరకు దేశంలో 23 కోట్ల మందికి టీకా ఇచ్చాం – అత్యవసర ఔషధాల ఉత్పత్తిని కూడా పెంచుకున్నాం – దేశంలో 7 కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ఉన్నాయి
మరో 3 వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి – ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ పై పరిశోధన జరుగుతోంది – వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెరిగింది – పిల్లల కోసం రెండు వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయి – WHO నిబంధనల ప్రకారమే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ – రెండు టీకాలు రూపొందించి భారత్ సత్తా చాటింది – కో-వి-డ్ పై పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది - భారత్ కు ప్రపంచం అండగా నిలిచింది. విమానాలు, రైళ్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేశాం – మనం రూపొందించుకున్న కో-వి-డ్ యాప్ మీద ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగతోంది - వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే – కేంద్రమే వ్యాక్సిన్ కొని రాష్ట్రాలకు ఇస్తుంది – 18ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ – ఈనెల 21 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా టీకా అందిస్తాం – అందరికి ఉచిత వ్యాక్సిన్ అందిస్తాం – ప్రైవేటు హాస్పిటళ్లలో సర్వీస్ ఛార్జి రూపంలో రూ.150 మాత్రమే తీసుకోవాలి - ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను దీపావళి వరకు కొనసాగిస్తాం : ప్రధాని మోడీ