బీజేపీతో జనసేన బంధం తెగిపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ తెలంగాణాలో 32 నియోజకవర్గాలకు జనసేన ఇన్చార్జులను పార్టీ అధిష్టానం ప్రకటించడమే. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేనని పోటీ చేయనివ్వకుండా బీజేపీ అడ్డుపడింది. బీజేపీ రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూసిన జనసేనాని వైసీపీ అరాచక పాలనపై తానే రోడ్డు ఎక్కేశారు. తాజాగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మేము ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చం అని స్పష్టం చేశారు. బీజేపీ తాము టార్గెట్ చేసే వివిధ పార్టీల నేతలను ఐటీ,ఈడీ దాడులు చేయిస్తూ లొంగదీసుకుంటోంది. బీజేపీతో జనసేన దూరం కావడంతో పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటి దాడులు జరిగాయనే ప్రచారం సాగుతోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ జనసేన పొత్తు చిత్తయినట్టే.
Advertisements