భోపాల్‌ భాజపా అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకుర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతలో తాను పాల్గొన్నందుకు గర్వంగా ఉందంటూ ఆమె ఓ టీవీ ఛానెల్‌ వద్ద వ్యాఖ్యానించారు. ‘‘నాడు ఆ నిర్మాణం కూల్చివేతలో నేను పాల్గొన్నాను. ఇందుకుగాను దానిపైవరకు ఎక్కాను. దీనికి నేను ఎంతో గర్వపడుతున్నాను. దేశంపై పడిన మచ్చను తొలగించడానికి దేవుడే నాకు ఆ శక్తిని ఇచ్చాడు. ఒక గొప్ప రామ మందిరం నిర్మితం కానుంది.’’ అని ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం (ఈసీ) తాజాగా ఆమెకు మరో సంజాయిషీ (షోకాజ్‌) నోటీసు ఇచ్చింది.

game 27032019

ఆమె మాటలు కుల, మత, ప్రాంతీయ, భాషా సామరస్యానికి సంబంధించి ఎన్నికల నియమావళిలోని చాప్టర్‌ 4ను ఉల్లంఘించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. నోటీసు అందుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటానన్నారు. చట్టప్రకారం ఈసీకి సమాధానం ఇస్తానని చెప్పారు. మందిరం నిర్మాణం దిశగా తననెవరూ ఆపలేరని అన్నారు. ఉగ్రవాద నిరోధక దళ (ఏటీఎస్‌) అధిపతి హేమంత్‌ కర్కరే తన శాపం వల్లే చనిపోయారంటూ ఇంతకుముందు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను ఇప్పటికే ఈసీ ఆమెకు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read