చరిత్రలోనే తొలిసారిగా సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థాన కేసులో సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. సతీష్‌బాబు సానా తన వాంగ్మూలంలో చెప్పినట్లుగా దేవేందర్‌కుమార్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని సీబీఐ పేర్కొంది. సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ తప్పుడు స్టేట్‌మెంట్‌ను సృష్టించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేరును సతీష్ సానా చెప్పకపోయినా డీఎస్పీ దేవేందర్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేశారని సీబీఐ గుర్తించింది. సతీష్ సానా ఢిల్లీలో ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదని తేల్చారు. సీబీఐ ఆఫీసులో తొలిసారి సోదాలు నిర్వహించిన అధికారులు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. అరెస్ట్‌ చేసిన దేవేంద్ర కుమార్‌ దగ్గర ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దేవేంద్రకుమార్‌ అరెస్టుతో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థాన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

modi 23102018

దీంతో సీబీఐలో లంచాల బాగోతం ప్రభుత్వాన్ని ఒక్క కుదుపు కుదిపింది. ప్రధాని మోదీ మెడకు చుట్టుకొని ఆయనను, బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థలో కీలక నేతలు పరస్పరం ఆరోపణలతో కీచులాడుకొని కేసులు పెట్టుకోవడంతో ప్రభుత్వ ప్రతిష్ట బజారున పడుతోందని గ్రహించిన మోదీ వెంటనే రంగంలోకి దిగారు. సోమవారం నాడు ఇద్దరు డైరెక్టర్లు- అలోక్‌ వర్మ, రాకేశ్‌ అస్థానాలను పిలిపించి మాట్లాడారు. ఈ వ్యవహారంలో గూఢచారి సంస్థ రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) ఉన్నతాధికారికి కూడా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో రా అధిపతి అనిల్‌ దస్మానాతోనూ ప్రధాని సోమవారం విడిగా మాట్లాడారు. అస్థానాను సస్పెండ్‌ చేయాల్సిందిగా అలోక్‌వర్మ వారం రోజుల కిందటే ప్రభుత్వానికి సిఫారసు పంపారు. అంటే అస్థానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన రోజే- అక్టోబరు 15నే ఈ సిఫారసుతో కూడిన నోట్‌ను పీఎంవోకు పంపారు. అయితే పీఎంఓ నుంచి దీనికి వెంటనే క్లియరెన్స్‌ రాలేదని తెలుస్తోంది.

modi 23102018

అస్థానాపై తదుపరి చర్యలకు ప్రధాని మోదీ విముఖంగా ఉన్నట్లు, దానికి అనుమతి నిరాకరించినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ మోదీ- అలోక్‌ వర్మ ఆరోపణలను కూడా పరిశీలించడానికి టైం తీసుకున్నట్లు పీఎంఓ వర్గాలు తెలిపాయి. అస్థానాను అదే పదవిలో కొనసాగనిస్తే రాజకీయంగా అది గుదిబండగా మారే ప్రమాదముందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. సస్పెండైనా చేయాలి, లేదా బదిలీ వేటైనా వేయాలి.. అన్నది పార్టీ ఆలోచనగా ఉన్నట్లు చెబతున్నారు. గుజరాత్‌ కేడర్‌ అధికారి అయిన రాకేశ్‌ అస్థానాను మోదీ ఏరికోరి సీబీఐకి తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు లంచాల బాగోతంలో ఇరుక్కోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read