రాజకీయ ఆరోపణలు రోజు రోజుకీ దిగజారుతూ ఉండటం చూస్తున్నాం. అయితే ఎమ్మల్యేలు, ఎంపీలు, మంత్రులు లాంటి వాళ్ళు ఇప్పటిదాక హద్దులు దాటుతూ మాట్లాడుతూ ఉండేవారు. కాని ప్రధాని స్థాయి వ్యక్తి దిగజారి మాట్లాడటం, బహుసా ఇదే మొదటి సారి అయ్యి ఉంటుంది. మన దేశానికి పట్టిన 'అదృష్టం' మోడీ గారి ద్వారా ఇది మరోసారి రుజువైంది. మొన్నటికి మొన్న నేను బీసీని అని కులం పేరు చెప్పి ఓట్లు అడుక్కున్న మోడి, ఈ రోజు మరింత దిగజారి, మీ ఎమ్మల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, మీ ప్రభుత్వాన్ని లాగేస్తాం అని మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి, ఇలా పబ్లిక్ గా హార్స్ ట్రేడింగ్ చెయ్యటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంత రాజకీయ ఆరోపణలు చేసినా, మరీ ఈ విధంగా, ప్రధాని స్థాయిని దిగజారుస్తు మోడీ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

modi 29042019

మూడేళ్ళ క్రిందట జగన్ మోహన్ రెడ్డి కూడా, ఇలాగే తోడ కొట్టారు. గవర్నర్ ఇంటి ముందు నుంచుని, చంద్రబాబు నీ 21 ఎమ్మెల్యేలు నాతొ టచ్ లో ఉన్నారు, గంటలో నీ ప్రభుత్వం పడిపోతుంది అని వార్నింగ్ ఇచ్చిన మాటలు, ఇంకా ఏపి ప్రజలకు గుర్తున్నాయి. ఇప్పుడు ప్రధాని స్థాయి వ్యక్తి అయిన మోడీ కూడా, జగన్ లాంటి వాడిలా మాట్లాడటం చూస్తుంటే, ఈ దేశం ఎటు పోతుందో అని ప్రజాస్వామ్య వాదులు బాధపడే పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడిన మాటలతో ప్రజలు ఆశ్చర్యపోయారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం.. రాష్ట్రంలోని టీఎంసీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ వదిలి బీజేపీలోకి వస్తారంటూ సంచలన ప్రకటన చేశారు.

modi 29042019

గాల్‌లోని సారంపూర్‌లో ఇవాళ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... ‘‘దీదీ, మే 23న ఫలితాలు వెలువడే రోజు ప్రతిచోటా కమలం వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని వదిలేస్తారు. ఇవాళ కూడా 40 మంది మీ ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు..’’అని పేర్కొన్నారు. బెంగాల్ సీఎం మమతపై ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు జరిగిన ర్యాలీల్లో మమతను ‘‘స్పీడ్ బ్రేకర్’’ అంటూ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ‘‘పశ్చిమ బెంగాల్‌లోని అభివృద్ధి ప్రాజెక్టులన్నిటీని ఆమె స్పీడ్ బ్రేకర్‌లా అడ్డుకుంటున్నారు..’’అని మోదీ వ్యాఖ్యానించారు. ఇటవల కూచ్ బెహార్‌లో జరిగిన ర్యాలీలోనూ ఆయన మమతపై విమర్శలు సంధించారు. ‘‘భారత్‌కు ఇద్దరు ప్రధానులు’’ కావాలంటున్న వారికి మమత మద్దతు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read