దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, కేంద్రంలో ప్రభుత్వం చేస్తున్న అవినీతి పై కనీసం పోరాడటం లేదు. ఈ సమయంలో, తెలుగుదేశం పార్టీ, మోడీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పై ఫోకస్ చేసింది. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రాగానే, చంద్రబాబుని లోపల వేస్తాం, లోకేష్ ను లోపల వేస్తాం అంటూ కబ్రులు చెప్పరే కాని, ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించలేకపోయారు బీజేపీ నేతలు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, డైరెక్ట్ గా మోడీ పై మొట్టమొదటి అవినీతి ఆరోపణ చేసింది. అన్ని వివరాలు మీడియా ముందు ఈ రోజు పెట్టింది. ఈ విషయం నేషనల్ మీడియా కూడా చెప్పి, తన దగ్గర ఉన్న ఆధారాలు అన్ని పార్టీలకు ఇవ్వనుంది. గత నెల రోజులుగా, మోడీ చేసిన అవినీతి గురించి, చెప్తాను అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఈ రోజు ఈ స్కాంకు సంబంధించి ఆధారాలు బయట పెట్టారు.

modi 18072018 2

ఎస్‌ఆర్‌ ఆయిల్‌ ఒప్పందంలో రష్యా కంపెనీతో కలిసి బీజేపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందంటూ బాంబ్ పేల్చారు. ఎస్ఆర్ ఆయిల్ కంపెనీ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో ఎస్‌ఆర్‌ ఆయిల్‌ కుంభకోణం జరిగిందని, ఆయన సమక్షంలో జరిగిన ఒప్పందానికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. రష్యాకు చెందిన ప్రైవేట్‌ కంపెనీతో ఒప్పందం జరిగితే.. ప్రభుత్వానికి-ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగినట్టు చూపెట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీ పదేపదే విదేశాలు తిరగడం.. ఎస్‌ఆర్‌ ఆయిల్‌ కుంభకోణం డబ్బుల కోసమేనని అన్నారు. ఎస్‌ఆర్‌ ఆయిల్‌ వ్యవహారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌... అక్కడి మంత్రిని అరెస్ట్ చేయించారని చెప్పారు.

modi 18072018 3

"ఎస్‌ఆర్‌ ఆయిల్ కంపెనీ విక్రయంలో భారీగా కుంభకోణం జరిగింది. 2016 బాలెన్స్ షీట్ లో రూ.3500 కోట్లు మాత్రమే ఉంది. 2016 డిసెంబర్ లో రూ.75 వేల కోట్లకుు సంస్థను ఎలా అమ్మారు. గ్రాస్ నెఫ్ట్ అనే కంపెనీని ఎస్‌ఆర్‌ కంపెనీని కొనుగోలు చేసింది. గ్రాస్ నెప్ట్ ఈక్విటీని కథార్ కంపెనీ కొనుగోలు చేసింది. అదే ఈక్విటీని ఖతార్ కంపెనీ నుంచి చైనీస్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈక్విటీ కొనుగోలు చేసిన చైనీస్ కంపెనీ ప్రతినిధులు అరెస్టయ్యారు. అదే సమయంలో మోదీ చైనాకు ఎందుకు వెళ్లారో చెప్పాలి. ఒప్పందం చేసుకున్న రష్యన్ మంత్రి ఇప్పుడు జైలులో ఉన్నారు. గోవా సమ్మిట్ లో రష్యా-భారత్ ఒప్పందం అని చెప్పారు.మోదీ-పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌ కంపెనీ విక్రయ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలి. గతంలోనే బీజేపీ కుంభకోణాలను బయటపెడతానని చెప్పా. నేడు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. పార్లమెంట్ లో మా ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తుతారు" అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read