బీజేపీ వ్యక్తి ఆధారిత పార్టీ ఎన్నటికీ కాదని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. సిద్ధాంతాల ప్రాతిపదికగానే పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు. ఏ నిర్ణయమైనా పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ చుట్టూనే బీజేపీ రాజకీయా లు తిరుగుతున్నాయని, ఆయనపైనే పార్టీ పూర్తిగా ఆధారపడిందన్న వ్యాఖ్యలను గడ్కరీ కొట్టిపారేశారు. బీజేపీ ఎన్నటికీ మోదీ లేదా అమిత్‌ షాది కాదని తేల్చిచెప్పారు. ‘‘గతంలో వాజ్‌పేయి, ఆడ్వాణీది కాలేదు.. ఇప్పుడు మోదీ, షా ది కాదు’’ అని గడ్కరీ అన్నారు. పార్టీ, ప్రధాని పరస్పరం సహకరించుకుంటారని వివరించారు. ‘‘పార్టీ బలంగా ఉండి నాయకుడు బలహీనంగా ఉంటే ఎన్నికల్లో విజయం సాధించలేం. కానీ నాయకుడు బలంగా ఉండి పార్టీ బలహీనంగా ఉన్నా గెలవొచ్చు. బలమైన నాయకుడికి సహజంగానే అగ్రస్థానం దక్కుతుంది’’ అని అన్నారు.

gadkari 11052019

ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతోనే.. జాతీయవాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందన్న ఆరోపణలను గడ్కరీ ఖండించారు. జాతీయవాదం సమస్య కాదని.. అది బీజేపీ ఆత్మ అని స్పష్టంచేశారు. కాగా, ప్రధాని కావాలనే ఆలోచన గానీ, కోరిక కానీ, అజెండా గానీ లేదని గడ్కరీ స్పష్టం చేశారు. ఓ ఆంగ్ల ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ విషయంలో దాచుకోవాల్సింది ఏమీ లేదని, ఈ విషయంపై ఇంతకు ముందే వివరణ ఇచ్చానని స్పష్టం చేశారు. అలాంటి ఆలోచనలు గానీ, కోరిక కానీ ఆయనకు లేదని, అజెండా కూడా లేదని తేటతెల్లం చేశారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో మిత్ర పక్షాలపై ఆధారపడాల్సి వస్తే కొత్త వ్యక్తిని తెరపైకి తెస్తారన్న ఊహాగానాలు మీడియాలో పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. అయితే వీటిని నితిన్ తోసిపుచ్చారు.

 

gadkari 11052019

వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమని, బీజేపీ ప్రభుత్వం ఎంతమాత్రం కాదని గడ్కరీ కుండబద్దలు కొట్టారు. ఒకవేళ బీజేపీకే మెజారిటీ వచ్చినా సరే, దానిని తాము ఎన్డీఏ ప్రభుత్వం గానే పరిగణిస్తామని, తమ మిత్రులను తమతో కలుపుకుపోతామని ఆయన తెలిపారు. ఏవిధంగా అత్యధిక సీట్లను సాధిస్తారని ప్రశ్నించగా... ఒడిశా, బెంగాల్, కేరళతో పాటు యూపీలో కూడా అత్యధిక సీట్లు సాధించడం ద్వారా తమ కల నెరవేర్చుకుంటామని నితిన్ గడ్కరీ ప్రకటించారు. బీజేపీ రానూ రానూ మోదీ కేంద్రంగానే నడుస్తోందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వాజ్‌పాయ్, ఆడ్వాణీ ఉన్న రోజుల్లోనూ అలా నడవలేదని, ఇప్పుడూ అలా నడవదని స్పష్టం చేశారు. బీజేపీ సైద్ధాంతిక పునాదులున్న పార్టీ అని, మోదీ,షా‌ పార్టీ ఎన్నటికీ కాదని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరానే కాంగ్రెస్, కాంగ్రెస్సే ఇందిరా అని అప్పటి అధ్యక్షుడు డీకే బరువా నినదించినట్టు ప్రస్తుతం మోదీ అంటే బీజేపీ, బీజేపీ అంటే మోదీ అన్నట్లు తయారైందా? అన్న ప్రశ్నకు గడ్కరీ స్పందిస్తూ బీజేపీ ఎప్పటికీ వ్యక్తి కేంద్రంగా నడవదని ఆయన తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read