అధికారంలో ఉండే ఎవరైనా అనే మాట, మరో 20 ఏళ్ళు, మరో 30 ఏళ్ళు ప్రజల ఆశీస్సులతో మాదే అధికారం అని అంటూ ఉంటారు.. మన రాష్ట్రంలో చంద్రబాబు కూడా ఈ మాట తరుచూ అంటూ ఉంటారు. కాని ఢిల్లీలో ఉన్న అహంకారులు మాత్రం, మీము యాభైఏళ్లు అధికారంలో ఉంటాం అంటున్నారు. యాభైఏళ్ల వరకు తమను ఓడించే నాథుడే ఉండడని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ఇక మోడీ గారు అయితే, మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదు అంటున్నారు. ఆదివారం పార్టీ జాతీయ కార్యవర్గం రెండో రోజు సమావేశంలో, మోడీ , షా ద్వయం, ఎంతో అహంకారంతో మాట్లాడిన మాటలు ఇవి. ఎవరైనా ప్రజా మద్దతుతో గెలుస్తారు. తమను ఓడించే నాథుడే లేడు అనే అహంకారులు, మిమ్మల్ని ఓడించేది రాహుల్ గాంధినో, మమతో, చంద్రబాబో కాదు.. మిమ్మల్ని ఓడించేది అయినా, గెలిపించేది అయినా ప్రజలు..

modi 10092018 2

ఆ ప్రజలు అంటే మీకు ఎంత చులకనో, మమ్మల్ని ఓడించే వాడే లేడు, మరో యాభైఏళ్లు మాదే అధికారం అనే అధికార అహం, తొందరోనే దిగుతుంది. ఇలా విర్రవీగి, ఎంతో మంది అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు. ఇందిరా గాంధీ లాంటి నేతే అడ్రస్ కోల్పోయింది. ఇంతే కాదు, ప్రధాని మోడీ గారు మరో మాట కూడా చెప్పారు, బీజేపీవద్ద పటిష్టమైన నాయకత్వం, విధానాలు, దేశాన్ని అభివృద్ధి చేయాలనే నిజాయితీ ఉన్నాయి అంట.. నోట్లు రద్దు, జీఎస్టీ లాంటి విదానులు, రాఫెల్ స్కాం లాంటి నిజాయతీ, ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకత్వం చేస్తే, మేమే గొప్ప అని మోడీ గారు చెప్పుకుంటున్నారు.

modi 10092018 3

తమకు అధికార అహంకారం లేదు.. ప్రజల అభివృద్ధికోసం పని చేసేందుకు అవకాశం కల్పించే ఆయుధమని ప్రధాని సెలవిచ్చారు. ఒక పక్క పెట్రోల్, డీజీల్ ధరలు వందకు చేరువలో ఉన్నాయి... ఇది అభివృద్ధా ? మరో పక్క రూపాయి పతనం భారీగా ఉంది... ఇది అభివృద్ధా ? ఇప్పటికీ ATMలలో డబ్బులు సరిగ్గా లేవు... ఇది అభివృద్ధా ? గుజరాత, మహారాష్ట్రా రాష్ట్రాలకు మిగిలిన రాష్ట్రాల నిధులు దోచిపెడుతూ, ఆ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసి, ఇదే మా అభివృద్ధి అని ప్రధాని చెప్పటం హాస్యాస్పదం. మరొకసారి ఈ ఢిల్లీ అహంకారులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మిమ్మల్ని ఓడించే నాధుడు రాహుల్ గాంధీనో మరొకరో కాదు, మిమ్మల్ని ఓడించే నాధుడు సాధారణ ప్రజలు... అహం వీడండి మోడీ - షా గారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read