సరిగ్గా మార్చ్ 10 వ తారీఖు.. ఉన్నట్టు ఉండి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ అంటూ మీడియాకు కబురు. ఎప్పుడో వస్తుంది అనుకున్న ఎన్నికల నోటిఫికేషన్ ముందే వచ్చేస్తుంది అంటూ లీకలు ఇచ్చారు. అంతా అనుకున్నట్టే, ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన విడుదల చేసారు. ఇందులో మొదటి ఫేజ్ లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పెట్టారు. ఎప్పుడూ చివరి ఫేజ్ లో ఉండే ఏపి ఎన్నికలు, ఈ సారి మొదటి ఫేజ్ లోనే పెట్టేసారు. అంటే ఏప్రిల్ 11 న, సరిగ్గా 30 రోజుల సమయం మాత్రమే. చంద్రబాబుని ఈ విధంగా దెబ్బ కొట్టవచ్చని, చంద్రబాబు ప్రిపేర్డ్ గా లేని టైం అనుకుని, మోడీ, షా ఎత్తుగడ వేసారు. అప్పటికి అభ్యర్ధుల పేర్లు ఖరారు కాలేదు, కొన్ని సంక్షేమ పధకాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.

game 27032019

అయితే చంద్రబాబు మాత్రం, ఎవరి ఊహలకి అందకుండా, పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, రుణమాఫీ చేసి, అవక్కయ్యేలా చేసారు. అంతే కాదు, అందరికంటే ముందే అభ్యర్ధుల కసరత్తు పూర్తి చేసారు. చంద్రబాబు అందరి కంటే ఎక్కువ ప్రచార సభల్లో పాల్గున్నారు. దాదపుగా 110 మీటింగ్లు పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి 70 కూడా పెట్ట లేక పోయాడు. ఎవరూ ఊహించని విధంగా, ప్రచారంలో చంద్రబాబు దూసుకు వెళ్లారు. అంతే కాదు, అటు మోడీ, ఇటు కేసీఆర్, ఇక్కడ జగన్, విజయసాయి రెడ్డి కుట్రలు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ, ప్రతి సందర్భంలో పై చేయి సాధించారు. చివరకు ఎన్నికల్లో ఈవీయం లు మొరాయించటం, తరువాత జరిగిన దాడి, ప్రజలను మళ్ళీ ఓటు వెయ్యటానికి పిలుపు ఇవ్వటం, ఇవన్నీ చంద్రబాబు ఎదుర్కుని, ప్రజల మద్దతుతో ఎన్నికలు పూర్తి చేసారు.

game 27032019

అయితే, ఎన్నికలు పూర్తి కావటంతో, ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకోవటం లేదు. వెంటనే మోడీ, షా కుట్రలను పసిగట్టారు. ఈవీయం లతో దేశ వ్యాప్తంగా కుట్ర చేస్తున్నారని తెలుసుకున్నారు. ఏపిలో ఎలా అయితే దీటుగా ఎదురుకున్నారో, అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో ఎదుర్కోవటానికి సన్నద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో, మోడీ, షా లను దేశ వ్యాప్తంగా ఉతికి ఆరేస్తున్నారు. ఈవీయం ల పై, 23 పార్టీలను కలుపుకుని యుద్ధం చేస్తున్నారు. అంతే కాదు, రేపటి నుంచి దేశ వ్యాప్తంగా ప్రచారానికి కూడా వెళ్తున్నారు, రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో మోడీ, షా లకు సినిమా అర్ధమైంది. మన అంతు చూడటానికి చంద్రబాబు రెడీ అయ్యారని, గ్రహించారు. ఏపిలో ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ లో పెడితే చంద్రబాబుకి ఇబ్బంది అనుకున్నాం అని, కాని ఇప్పుడు 43 రోజులు అతనికి టైం ఇచ్చి, కోరి మరీ తన్నించుకున్నట్టు ఉందని, వాపోతున్నారు. మొత్తానికి చంద్రబాబు చేస్తున్న దేశ వ్యాప్త పోరాటంలో, మోడీ, షా ల పతనం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read