చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్... ఇది 2014 సక్సెస్ కాంబినేషన్.... చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అన్ని విధాలుగా గౌరవం ఇస్తున్నారు, పవన్ ఏ సమస్య లేవనెత్తినా పరిష్కరిస్తున్నారు.. మరో పక్క, మోడీ మాత్రం పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టారు... స్వచ్ఛతేసేవ’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ పవన్‌కాల్యాణ్ మినహా తెలుగు సినిమాలోని పలువురు ప్రముఖులకు ప్రధాని లేఖలు రాశారు... దర్శకుడు రాజమౌళి, సీనియర్ నటుడు మోహన్‌బాబు, స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్‌బాబులకు ప్రధాని లేఖలు రాశారు.. కాని తెలుగులో టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న, పవన్ కు మాత్రం మోడీ లేఖ రాయలేదు..
అయితే ప్రతి సందర్భంలో పవన్, కేంద్రాన్ని నిందిస్తున్నారు.... ట్విట్టర్ లో, ఘాటు పోస్ట్లు పెడుతూ, కేంద్రాన్ని నిందిస్తున్నారు... ఈ సమయంలో పవన్‌కు మినహా మిగిలిన సినీ ప్రముఖులకు ప్రధాని లేఖలు రాయడం చర్చకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో కలిసి పోటీ చేశారు, NDA సమావేశానికి పవన్ ను పిలిచారు... మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పవన్ వెళ్లి, మోడిని ఆళింగనం చేసుకున్నారు.. ఇంతటి సాన్నిహిత్యం ఇప్పుడు లేదు..
అయితే, రాష్ట్ర బీజేపి నేతలు మాత్రం, రాజకీయ నేపధ్యం ఉన్న ఏ హీరోలని పిలవలేదు అని, అందుకే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కి కూడా లేఖలు రాయలేదు అని, అందుకే పవన్ కి కూడా రాయలేదు అని, అంతకు మించి, ఏమి లేదు అని అంటున్నారు... అయితే, అదే సందర్భంలో, కృష్ణం రాజు బీజేపి నేతగా ఉన్నారు, మరి ప్రభాస్ కు లేఖ రాసారు కదా అంటున్నారు పవన్ అభిమానులు... మొత్తానికి, పవన్‌కు మోదీ లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది...