రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు...ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ తీరు వల్లే రాష్ట్రానికి ఇప్పుడు సమస్యలు వచ్చాయని, రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా కాంగ్రెస్ మోసం చేసిందని మోదీ మండిపడ్డారు... రెండు రాష్ట్రాలకూ న్యాయం జరుగుతుందనే తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చామని మోదీ తెలిపారు. ఏపీకి అండగా ఉంటామని చెప్పారు. అయితే మోడీ, ఎక్కడా ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై నిర్దిష్ట హామీ కాని, ప్రకటన కాని చెయ్యలేదు....
ఎక్కడా కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చేసాం, ఇది చేస్తాం అని చెప్పలేదు... టీడీపీ ఎంపీల ఆందోళనపై నేరుగా కామెంట్ చేయని ప్రధాని మోదీ.. సభా కార్యక్రమాలకు అడ్డు తగలాలని ఎవరు అనుకున్నా పార్లమెంట్‌కు అది శ్రేయస్కరం కాదని హితవు పలికారు. ఈ ప్రసంగం మధ్యలో మోదీ.. ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. దీనికోసమే తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ సినిమాలు వదిలి రాజకీయ ప్రవేశం చేశారని గుర్తుచేశారు.
మోదీ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు... ప్రధాని ప్రసంగం మొదట్లో తెదేపా ఎంపీలు కూడా నినాదాలు చేశారు... అయితే మోడీ ఆంధ్రప్రదేశ్ గురించి ప్రకటన చేస్తారు అని కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ చెప్పటం, మోడీ ప్రసంగం కూడా ఆంధ్రప్రదేశ్ అన్యాయం గురించి మొదలవ్వటంతో, తెదేపా ఎంపీలు ఆందోళన విరమించి వారి స్థానాల్లో కూర్చున్నారు... అయితే అనేక సందర్భాల్లో ఏపికి అన్యాయం గురించి మాత్రమే ప్రస్తావిస్తూ, ఎన్టీఆర్ గురించి, తెలుగు ఆత్మ గౌరవం అంటూ, ఎమోషనల్ డైలాగ్స్ తోనే ప్రసంగం ముగించారు... వైకాపా సభ్యులు మాత్రం ప్రధాని మోడీ ప్రసంగం మొదలు కాక ముందే, సభ నుంచి బయటకు వెళ్లిపోయారు...