గడచిన ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్కసారి కూడా ప్రెస్ మీట్లో పాల్గొనలేదు. ఈ విషయంపై రాహుల్ పదేపదే ఆయనపై దాడి చేశారు కూడా! ఎందుకు మీడియాకు మొహం చాటేస్తున్నారని విపక్ష నేతలు కూడా ఆయనను నిలదీసినా మోదీ పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం తన షరతుల మేరకు కొన్ని ప్రధాన మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన ప్రెస్మీట్ పాల్గొంటారని ఎవ్వరూ ఊహించలేదు. నిజానికిది అమిత్షా ఎప్పుడూ నిర్వహించే మీడియా సమావేశంగా మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు.
తీరా మొదలయ్యే సమయానికి అకస్మాత్తుగా మోదీ కూడా వచ్చి కూర్చున్నారు. ఆయన ఈ ప్రెస్మీట్లో పాల్గొన్నారు తప్పితే విలేఖరుల నుంచి ఎలాంటి ప్రశ్నలకూ ఆస్కారమివ్వలేదు. ప్రతీ ప్రశ్ననూ అమిత్ షాకే మళ్లించారు. ‘బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ. మా పార్టీ అధ్యక్షుడే ప్రధానం. ఆయనే బదులిస్తారు. నేను క్రమశిక్షణ గల సైనికుడిని’’ అని దాటవేశారు. ప్రారంభంలో మాత్రం తాను చెప్పదల్చుకున్నది చెప్పేశారు. తొలిసారి మీడియా ముందుకు వచ్చిన మోదీ.. ప్రెస్ కాన్ఫరెన్స్లో వ్యవహరించిన తీరుపై రాహుల్ సెటైర్స్ వేశారు. ప్రశ్నలన్నింటినీ మోదీ అమిత్ షాకు ఫార్వర్డ్ చేశారు. ఈసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ మీకు అవకాశమివ్వాలంటూ రాహుల్ సెటైర్. ప్రచార పర్వానికి తెరపడే ఆఖరి గంటలో మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఐదేళ్ల కాలంలో ఇదే మోదీకి తొలి మీడియా సమావేశం. దీంతో తాను ఎదుర్కోబోయే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెబుతారోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే మోదీ అంత రిస్క్ తీసుకోలేదు. విలేఖరులు ప్రశ్నలడిగిన ప్రతిసారి మోదీ అమిత్ షా వైపు చూడటం ఆశ్చర్యపరిచింది. మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా బాగా జరిగిందంటూ రాహుల్ సెటైర్స్ వేశారు. ఈసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీకు మాట్లాడే అవకాశన్ని అమిత్ షా ఇవ్వాలని కోరుకుంటున్నానని రాహుల్ ఎద్దేవా చేశారు.