గత కొన్ని రోజులుగా టెన్షన్ తో కొట్టుకుంటున్న జగన్, పవన్ లకు, ఢిల్లీ నుంచి మోడీ గారు చల్లని కబురు వినిపించారు. న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చినంత సంతోషంతో, జగన్, పవన్ లు ఉన్నారు. వారం నుంచి ప్రజలను ఎలా ఫేస్ చెయ్యాలా అని ఆలోచలనలో ఉన్న జగన్, పవన్ లకు మోడీ చెప్పిన గుడ్ న్యూస్ తో, ఊపిరి పీల్చుకున్నారు. జనవరి 6 న మోడీ గుంటూరులో బహిరంగ సభ కోసం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, విభజన బిల్లులో అంశాలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవటంతో, మోడీ పర్యటన పై నిరసన తెలుపుతామని, చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ప్రజలు కూడా స్వచ్చందంగా నిరసన తెలపటానికి సిద్ధమయ్యారు. అయితే పవన్, జగన్ మాత్రం మోడీ పర్యటన పై ఒక్కటంటే, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.
పర్యటన దగ్గర పడే కొద్దీ, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంటే, జగన, పవన్ మాత్రం కలుగుల్లో దాక్కున్నారు. చంద్రబాబు కూడా ప్రతి రోజు, వీరిని, మోడీ పర్యటన పై వైఖరి చెప్పమని అడుగుతున్నారు. ఈ నేపధ్యంలో, ఈ రోజు ఢిల్లీ నుంచి వీరిద్దరికీ గుడ్ న్యూస్ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన వాయిదా పడింది అంటూ, పీఎంఓ నుంచి కబురు వచ్చింది. దీంతో, జగన్ పవన్ లకు పెద్ద గండం తప్పింది. మోడీ కనుక వచ్చి ఉంటే, చంద్రబాబు పెద్ద ఎత్తున నిరసన తెలిపే వారు. అది టాక్ అఫ్ ది నేషన్ అయ్యేది. జగన్, పవన్ మాత్రం, మోడీ ని ఒక్క మాట కూడా అనకుండా, ఎక్కడో దాక్కునే వారు. ప్రజలకు ఫుల్ క్లారిటీ వచ్చేది. అయితే, ఇప్పుడు మోడీ రారు అని తెలియటంతో, వీరి ఇద్దరికే, పెద్ద గండం తప్పింది.
బిజీ షెడ్యూల్, ఆకస్మిక కార్యక్రమాల వలన ఈ టూర్‌ను మోడీ వాయిదా వేసుకున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో మోదీ పర్యటన ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. జనవరి 6న కేరళన కేరళ, ఆంధ్రప్రదేశ్ పర్యటనలకు షెడ్యూల్ ఖరారయ్యింది. కేరళ పర్యటన తర్వాత.. ఏపీకి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. కేరళ పర్యటనలోనే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీ పర్యటనకు సమయం సరిపోదనే కారణంగానే వాయిదా వేసుకున్నారట. ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడటంతో బీజేపీ శ్రేణులు కాస్త నిరుత్సాహపడ్డాయి. ఉన్నట్టుండి టూర్ వాయిదా వేయడంతో టీడీపీ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుందని బీజేపీ నేతలు బాధ పడుతున్నారు.