ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు చేసిన వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడింది. విశాఖపట్నం రుషికొండలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు నిగ్గు తేల్చేందుకు, కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పై ఈ రోజు రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత వాయిదా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ నియమించి, రుషికొండ అక్రమాలు నిగ్గు తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముగ్గురి అధికారులను ఈ కమిటీలో నియమించారు. దీంతో ఈ కమిటీ నియామకం పై పిటీషనర్ తరుపున న్యాయవాది కేఎస్ మూర్తి, అశ్వినీ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టుకు తెలిపారు. దీని పై రాష్ట్ర హైకోర్టు, ఈ కమిటీ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ వేసి, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ రోజు దీని పై కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో, తాము రాష్ట్ర ప్రభుత్వం అధికారులని కమిటీలో నియమించటం కరెక్ట్ అని, తప్పేమీ కాదని, సమర్ధిస్తూ, తన అఫిడవిట్ లో పేర్కొంది. దీంతో కేంద్ర దాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

modi tieup with jagan 21122022 1

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యిందా ? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపిందా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయం ఏంటో తామే తేలుస్తాం అని ధర్మాసనం పేర్కొంది. ఈ రోజు సాయంత్రం లోపు తమకున్న అభ్యంతరాలను, పిటీషనర్లు అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రేపు ఉదయానికి వాయిదా వేసింది. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం అధికారులతో తామే ఒక కమిటీని నియమిస్తామని హైకోర్ట్ స్పష్టం చేసింది. తప్పులు చేస్తున్నారని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులని కమిటీలో వేస్తే, రుషికొండల అక్రమాలు జరిగితే ఎలా బయటకు వస్తాయని అనుకుంటున్నారు అంటూ కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రేపు ఉదయానికి విచారణను వాయిదా వేయటంతో పాటుగా, రేపు కమిటీ విషయం పై కూడా తామే తేల్చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ విషయంలో కేంద్రానికి మాత్రం గట్టిగానే అక్షింతలు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపారా అని కోర్టు అనటం పై కేంద్రం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read