ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించడం పట్ల సీఎం చంద్రబాబు దీక్ష చేస్తున్న వేళ,మోడీ చంద్రబాబుని ఉద్దేశించి ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఆయన చిరకాలం చల్లగా ఉండాలంటూ ప్రధాని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ మోదీ ట్విటర్లో స్పందిస్తూ... ‘‘ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని వేడుకుంటున్నా...’’ అని పేర్కొన్నారు. ఓ వైపు పుట్టినరోజునే చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తుండగా.. మరోవైపు శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరో పక్క, శుక్రవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని మనసారా కోరుకుంటున్నానని ట్విట్టర్ ఖాతాలో జగన్ పేర్కొన్నారు. పోయిన ఏడాది, చంద్రబాబు జగన్ పుట్టిన రోజు నాడు విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. మరో పక్క గవర్నరు నరసింహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం గవర్నరు నరసింహన్ చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఏపీ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు చంద్రబాబుకు శక్తి, ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని గవర్నర్ ఆకాంక్షించారు.
అలాగే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా కూడా ట్వీట్ చేసారు "Wishing N Chandrababu Naidu @ncbn Ji a very happy birthday".. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. "Warm wishes to Andhra Pradesh CM Shri N Chandrababu Naidu Garu. May the Almighty bless you with good health, happiness and a long life." తమిళ నాడు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ కూడా విషెస్ చెప్పారు 'I convey my birthday greetings to @ncbn and wish him a healthy life and successful stint in serving the people of Andhra Pradesh and this country. On this occasion, I request @ncbn to continue speaking out for States' rights and federal autonomy."