కేంద్రంలో 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. సంపూర్ణ బలముందన్న ధీమాలో ఎన్డీయే, ఏమైనా జరగొచ్చంటూ విపక్షాలు చెప్పుకొస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మోదీ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా ముఖ్యమైన రోజు అని, అంతరాయం లేని.. నిర్మాణాత్మక చర్చకు సహచర ఎంపీలంతా సహకరిస్తారనే ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. చర్చను ఎంపీలందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నానని.. ప్రజలకు.. రాజ్యాంగ రూపకర్తలకు మనం ఈ ప్రమాణం చేస్తున్నామని, దేశమంతా ఈ చర్చను పరిశీలిస్తోందని మోదీ ట్వీట్ చేశారు.

moditweet 20072018 2

అయితే ప్రధాని ట్వీట్ పై విమర్శలు వస్తున్నాయి. ఇన్ని కబురులు చెప్పే ప్రధాని గారు, విపక్షాలకు మాట్లాడటానికి ఎంత టైం ఇచ్చారు ? అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం పార్టీకి 13 నిమషాలు ఇచ్చి, దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు 38 నిమషాలు ఇచ్చి, బీజేపీ మాత్రం 3 గంటలు 33 నిమషాలు తీసుకుని, ప్రతిపక్షాలు గొంతు నొక్కేలా చేసి, ప్రధాని ఇంత అద్భుతంగా ట్వీట్ చెయ్యటం పై విమర్శలు వస్తున్నాయి.

moditweet 20072018 3

విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలులో కేంద్రం విఫలమైనందున ప్రభుత్వ వైఖరిని అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో తెలుగు దేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై సభలో ఉదయం 11 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత ఓటింగ్‌ జరుగుతుంది. మిత్రపక్షాలతో కలిసి కేంద్రానికి 316 మంది మద్దతు ఉంది. ప్రతిపక్ష పార్టీలకు 146కు మంచి బలంలేదు. దీంతో ఓడిపోతామనే భయం ప్రభుత్వానికి లేదు. గెలుస్తామని ప్రతిపక్షాలూ అనుకోవడం లేదు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వీలైంతగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కాగా చర్చలో తమకు లభించిన సమయంలో ప్రతిపక్షాలను ఎండగట్టాలని కేంద్రం అనుకుంటోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read