శ్రీశైలంలో జరగుతన్న ఉగాది కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గున్నారు... ఆంధ్రప్రదేశ్ రావటానికి ఎప్పటి నుంచో, ప్రధాని గారికి కుదరటం లేదు... ఇక్కడకు రావటానికి టైం సరిపోక, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే కార్యక్రమంలో మోదీ పాల్గుని ప్రసంగిచారు... ప్రజలకు ఉగాది సందేశం ఇచ్చారు... ఇక్కడ వరకు బాగానే ఉంది... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎమన్నా సందేశం ఇస్తారేమో అని, అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు... ఎందుకంటే, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబాట్టి... కాని, మన ఆశల మీద ప్రధాని నీళ్ళు చల్లారు...
ఈ అవకాశాన్ని కూడా, కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు... కర్నాటకలో ఎన్నికలున్నాయి కాబట్టి, శ్రీశైలంకి కన్నడ భక్తులు వస్తారు కాబట్టి , వారికోసం ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారా అనే అనుమానం కలుగుతుంది... ఎందుకంటే, ఆ వీడియో మొత్తం, కన్నడలో కట్టిన బ్యానర్స్ దర్శనం ఇచ్చాయి... చివరకు వీడ్కోలు చెప్పింది కూడా కన్నడలోనే.... శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లో ఉంది... ఇక్కడ ప్రజలు మాట్లాడే భాష తెలుగు అనే విషయం ప్రధాని గారు మర్చిపోయారు... తెలుగు ప్రజలతో పని లేదు అనే భావనలో ప్రధాని గారు ఉన్నారేమో...
పొలిటికల్ గా ఎన్నైనా ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రజలు ఏమి తప్పు చేశారు సార్.... కర్ణాటక ప్రజల గురించి మాత్రమే మాట్లాడారు కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చేప్పలేదు. సంక్రాంతి పండగ రోజు కూడా ఇలాగే చేసారు... సంక్రాంతి పురస్కరించుకుని, తమిళనాడు,గుజరాత్, మరాఠీ, పంజాబ్, నార్త్ ఇండియన్ సోదరుల అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్పారు... తమిళ్, కన్నడ, పంజాబీ ఇలా వేరు వేరు భాషల్లో ట్వీట్ చేసారు.... కాని మన తెలుగు వారు జరుపుకొనే సంక్రాంతి మాత్రం మర్చిపోయారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగువారికి, వారి తెలుగు భాషలో కాని, ఇంగ్లీష్ లో కాని, పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు ప్రధాని.... ఇప్పుడు ఉగాది పండుగ పురస్కరించుకుని చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా, మన రాష్ట్రంలో ఉన్న శ్రీశైలంలో ఉన్న వారితో మాట్లాడుతూ, ఒక్క ముక్క తెలుగులో చెప్పక పోగా, కన్నడలో చెప్పారు.... రేపైనా ఏమన్నా ట్వీట్ చేస్తారేమో చూద్దాం...