మొన్నటి మొన్న, నేను బీసీని, నన్ను తోక్కేస్తున్నారు అంటూ సాక్షాత్తు ఒక దేశ ప్రధాని కులం గురించి మాట్లాడటం చూసాం... అవి విన్న ప్రజలు, ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా కూడా మాట్లాడతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఏకంగా దేశ బధ్రత, సైనికుల త్యాగాలు కూడా మోడీ ప్రచారంలో వాడుకుని, మరింత దిగజారి పోతున్నారు. 70 ఏళ్ళలో ఈ దేశాన్ని ఎంతో మంది పాలించారు. వాళ్ళందరి నాయకత్వంలో మన సైన్యం ధీటుగా నిలబడింది. అయితే వాళ్ళు ఎప్పుడూ మేమే ఈ దేశాన్ని కాపాడుతున్నాం, మాకే ఓటు వెయ్యండి అని మోడీ లాగా ఎన్నికల ప్రచారంలో అడగలేదు. నిన్న మోడి మరింత దిగజారి, పాకిస్తాన్, బాంబులు అంటూ, దేశ బధ్రత గురించి కూడా, ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారు. అయితే అందరి పై ఒంటి కాలు మీద వెళ్ళే ఎన్నికల కమిషన్, మోడీ మాటల పై మాత్రం, నిద్ర మత్తులో ఉంది.

modi 22042019

నిన్న మోడీ మాట్లాడుతూ, పాకిస్థాన్‌ బెదిరింపులకు భయపడే స్థితిలో భారత్‌ లేదని ప్రధాని మోదీ అన్నారు. ‘అణ్వాయుధాల బటన్‌ నొక్కుతాం.. అణ్వాయుధాల బటన్‌ నొక్కుతాం’ అంటూ హెచ్చరికలు చేయడాన్ని ఆ దేశం ఆపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారత్‌ అమ్ములపొదిలోని అణ్వాయుధాలు దీపావళి వేడుకల కోసం దాచినవి కాదనే విషయాన్ని పాక్‌ ఇప్పటికైనా గ్రహించాలన్నారు. ఆదివారం గుజరాత్‌లోని పటన్‌, రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘర్‌ నగరాల్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మోదీ మాట్లాడారు. పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను సురక్షితంగా అప్పగించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాను గట్టిగా హెచ్చరించినందు వల్లే పాక్‌ తోకముడిచిందని ప్రధాని వెల్లడించారు.

modi 22042019

తాను హెచ్చరించిన మరుసటిరోజే(ఫిబ్రవరి 27).. ‘పరిస్థితి చేయిదాటితే ప్రయోగించడానికి భారత్‌ 12 క్షిపణులను మోహరించింది’ అని అమెరికా సీనియర్‌ అధికారులు పాకిస్థాన్‌కు తెలియజేశా రన్నారు. అదే రోజు సాయంత్రంకల్లా భారత పైలట్‌ను తిరిగి అప్పగించేస్తామంటూ పాక్‌ ప్రకటన చేసిందని చెప్పారు. ఒకవేళ అదే జరగకపోయి ఉంటే ఆ రోజు రాత్రి.. పాకిస్థాన్‌ పాలిట ‘కాళ రాత్రి’(ఖతల్‌ కీ రాత్‌) అయి ఉండేదన్నారు. మోదీ అనే భారత ప్రధాని హయాంలో పూడ్చుకోలేనంత నష్టం జరిగిందంటూ పాకిస్థానీయులు భావితరాలకు చెప్పుకునే పరిస్థితి తలెత్తేదని వివరించారు. అయితే ఒక దేశ ప్రధాని, ఇలా దేశ బధ్రత పై కూడా, దిగజారి ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవటం, ఇంతకు ముందు ఎప్పుడూ లేవని, ఈ 5 ఏళ్ళలో ప్రజలకు ఏమి చేసాం, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తాం అని చెప్పకుండా, ఇలా ప్రజలని ఎమోషనల్ బ్లాకు మెయిల్ చెయ్యటం, ఇదే మొదటి సారి అని విశ్లేషకులు చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read