నిన్న శుక్రవారం కదా... ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి శుక్రవారం గురించి బాగా తెలుసు... రాష్ట్రాన్ని దోచేసి, సర్వ నాశనం చేసిన వారిని విచారించే రోజు... 16 నెలలు జైలు జీవితం అనుభవించి, షరతుల పై బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారు A1, A2... దేశ అత్యున్నత విచారణా సంస్థలు అయిన సిబిఐ, ఈడీ 11 కేసులు పెట్టి లోపల వేశారు.. అందుకే ప్రతి శుక్రవారం ఎక్కడ ఉన్నా విచారణకు హాజరు అయ్యే జీవితాలు అవి... ఇంత గొప్ప ఘనకీర్తి కలవారు, రాజ్యసభ ఉంది అనే వంకతో A2 శుక్రవారం కోర్ట్ ఎగ్గొట్టి, భారత దేశ ప్రధానిని కలిసారు.... 11 కేసుల్లో దొంగలు అని దేశ అత్యున్నత విచారణా సంస్థలు అయిన సిబిఐ, ఈడీ అభియోగాలు మోపి, విచారణ జరుగుతున్న సందర్భాలో, దేశ ప్రధాని, ఇలా A2ని కలవచ్చా ?
సరే, కలిసారు... ఈ భేటీ నిన్న ఉదయం 11:20కి, 15 నిమిషాలపాటు జరిగింది... నిన్న రాత్రి దాకా, అసలు ఈ భేటీ అజెండా ఏంటో బయటకు రాలేదు... మర్యాదపూర్వకంగా కలిశారు అని ప్రచారం జరిగింది... సామాన్యంగా ప్రధానిని కలిస్తే నానా హంగామా చేస్తారు... ఇక సాక్షి అయితే, రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ మేము ఉద్దరిచ్చేస్తున్నాం అన్నంత బిల్డ్ అప్ ఇస్తుంది... కాని ఈ సారి అలా జరగలేదు... రాత్రి దాకా అసలు ఈ భేటీ ఎందుకు జరిగిందో ఎవరికీ తెలీదు... చివరకు సాక్షి కవరింగ్ చేస్తే, ఒక స్టొరీ అల్లింది... ఆ భేటీ ఎందుకు జరిగిందో చెప్పింది... ఆ భేటి ఎజెండా వింటే ఎంతో కామెడీగా ఉంటుంది...
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అఖండ విజయానికి, విజయసాయి రెడ్డి ముగ్ధుడు అయ్యి, ప్రధానిని అభినందించారు అంట.. అంతేనా, నిన్న వైకుంఠ ఏకాదశి కదా, అందుకే విష్ చెయ్యటానికి వెళ్లారు అంట... ఈ రెండిటితో ఆపితే అది సాక్షి ఎందుకు అవుతుంది... అసలు కామెడీ ఇది... వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్విజయంగా కొనసాగిస్తోన్న ప్రజాసంకల్పయాత్ర వివరాలను, పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన గురించి ప్రధాని మోదీకి తెలిపారు అంట.. ఆ స్పందన గురించి తెలుసుకున్న ప్రధాని, ఆశ్చర్యపోయారు అంట... ఇది ఆ భేటీ ఎజెండా అని సాక్షి తెలిపింది... ఇది విషయం... ఇలాంటి అవినీతి కేసుల్లో ఉన్నోడిని, ప్రధాని స్థాయి వ్యక్తి కలిసి సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారో ?