ప్రధాని నరేంద్ర మోడీ, అవినీతి పై యుద్ధం చెయ్యటానికో మరి దేనికో కాని, రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద నిజాయితీ పరుడైన జగన్ కు అత్యంత ఆప్తుడు, జగన్ కు అన్నిట్లో తోడూ నీడగా ఉండే విజయసాయి రెడ్డిని కలిసారు. ఈ నిజాయితీ పరుడు జగన్ అక్రమ ఆస్తుల కేసులో 11 కేసుల్లో A2గా ఉన్నారు... అసలైతే ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్ట్ లో హారజవ్వాల్సిన ఈ నిజాయతీ పరుడు, ప్రధాని మోడీని కలిసారు... రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబాట్టి, ఈయనకు కోర్ట్ మినహాయిపు ఇచ్చింది. అయితే, జగన్ మాత్రం ఇవాళ పాదయాత్ర ఆపుకుని మరీ కోర్ట్ కి వెళ్లారు.
ఇవాళ ఉదయం 11.45 నిమిషాలకు, ప్రధాని మోడీతో, ప్రధాని విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 15 నిమషాల పాటు చర్చలు జరిగినట్టు వార్తలు వచ్చాయి.... ఇంత సడన్ గా ఈ భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది.... విజయసాయి రెడ్డి అప్పాయింట్మెంట్ అడిగారా, లేక ప్రధాని మోడీనే, పిలుపించుకుని మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. చర్చలు వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.. అప్పట్లో జగన్ కూడా ఇలాగే సైలెంట్ గా వెళ్లి ప్రధానికి కలిసి వచ్చారు. అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనమే అయ్యింది... ఇప్పుడు విజయసాయి రెడ్డి భేటీ వెనుక అనేక రాజకీయ పరిణామాలే కారణమని తెలుస్తుంది.
ఒక పక్క జగన్ బీజేపీతో విలీనం కాని, ఎన్నికల్లో పొత్తు కాని అనే వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఈ వార్తలకి బలం ఇస్తూ అనేక పరిణామాలు కూడా జరిగాయి... మరో పక్క సోము వీర్రాజు లాంటి సెకండ్ గ్రేడ్ నాయకుల చేత చంద్రబాబుని తిట్టిస్తూ, మరో పక్క జగన్ ను ఎత్తిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు... ఇవన్నీ జరుగుతూ ఉండగానే 2జీ లాంటి అతి పెద్ద అవినీతి కేసులో అందరినీ విడిచిపెట్టటం పెద్ద సంచలనం అయ్యింది.. ఇప్పుడు జగన్ కేసులు కూడా నీరుగారుతాయా అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి... ఈ పరిణామాల నేపధ్యంలో, విజయసాయి రెడ్డి లాంటి ఆర్ధిక నేరాలు చేసాడు అని అభియోగాలు సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు చెప్పిన నేపధ్యంలో, ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి వారిని కలవటం ఎంత వరకు సమంజసమో, ప్రధానికే తెలియాలి...