ప్రధాన మంత్రి మోదీ వైఖరి చూస్తుంటే జగన్ రెడ్డి ఏమి చేసినా రైట్, కేసీఆర్ ఏ తప్పు చేయకున్నా రాంగ్ అన్నట్టుంది పరిస్థితి. శనివారం సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని.. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారన్నారు. తెలంగాణలో తండ్రి, కొడుకు, కుమార్తె ఇలా అందరూ అధికారంలో ఉన్నారని.. కుటుంబ పాలక కారణంగానే అవినీతి పెరిగిపోయిందన్నారు. కుటుంబ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. 42 వేల కోట్ల అవినీతిలో ఆల్రెడీ 30 కేసులు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి అవినీతి గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ మాట్లాడరు. పరిమితికి మించి అప్పులు చేసినా, ఇంకా అప్పులు జగన్ రెడ్డికి ఇస్తూనే ఉన్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కాములో 100 కోట్లు చేతులు మారాయని కేసీఆర్ కుమార్తెని టార్గెట్ చేసిన బీజేపీ పెద్దలు..అదే స్కాముతో సంబంధం ఉన్న వైసీపీ నేతల జోలికి రావడంలేదు. ఏపీలో ప్రజల ప్రాణాలు తీస్తోన్న మద్యం ద్వారా వేలకోట్లు జగన్ సిండికేట్ కొల్లగొడుతోందని ఆరోపణలున్నా ఇటువైపే దృష్టి పెట్టడంలేదు. అంటే జగన్ రెడ్డికి మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టున్నారు.
బెదిరింపులు కేసీఆర్ కేనా ? జగన్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారా మోడీజీ ?
Advertisements