తిత్లీ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇంకా కోలుకోలేదు. ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపట్టినా.ఇంకా చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా, రోడ్డు సౌకర్యం కల్పించలేని పరిస్థితి. అయితే తిత్లీ తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుఫాన్‌తో తీవ్ర నష్టం జరిగిందని, రెండు జిల్లాల్లో రూ.2,800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు లేఖలో పేర్కొన్నారు. తక్షణమే రూ.1200 కోట్లు ఇవ్వాలని లేఖలో సీఎం కోరారు.

cbn leter 13102018 2

తితలీ తుఫాన్‌ ఉధృతికి ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయని, హార్టీకల్చర్‌కు వెయ్యి కోట్ల నష్టం చేకూరిందని, అలాగే ఇతర పంటలు 800 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వీటితో విద్యుత్‌ నష్టం 500కోట్లు, రోడ్లు భవనాలు-100కోట్లు, పంచాయతీరాజ్‌కు100 కోట్లు, ఫిషరీస్‌- 50 కోట్లు, రూరల్‌ వాటర్‌ సప్లయ్ 100కోట్లు, ఇరిగేషన్‌కు 100 కోట్ల నష్టం వాటిల్లినట్లు లేఖలో ప్రధాని మోదీకి చంద్రబాబు నాయుడు తెలిపారు. రోడ్లు, ప్రభుత్వ భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. జిల్లాలో 12,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయన్నారు.

cbn leter 13102018 3

రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1,200 కోట్లు విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తిత్లీ దెబ్బకు మౌలిక వసతులు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, హూద్ హూద్ తుఫాను సందర్భంగా, కేవలం 1000 కోట్ల సహాయం చేసి, అందులో కూడా కేవలం సగం మాత్రమే విడుదల చేసిన ప్రధాని, ఈ సారి ఎంత ఇస్తారో అని ఏపి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరో పక్క, తుపాను బాధిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తుపాను బాధిత ప్రాంతాల్లో అధికారులు సరుకులను పంపిణీ చేశారు. 11 మండలాల్లో 2.50 లక్షల కుటుంబాలకు 6 రకాల సరుకుల పంపిణీ చేశారు. తుఫాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read