ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. చాలా రోజుల తరువాత, ప్రధానికి చంద్రబాబు లేఖ రాసారు. ముఖ్యంగా బీసిల సమస్యల పై చంద్రబాబు ఈ లేఖ రాసారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధానికి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు. సరైన సమాచారం లేక బీసీలకు అన్యాయం జరుగుతోందని చంద్రబాబు లేఖలో తెలిపారు. బీసీలు ఇంకా వెనుకబడే ఉంటున్నారని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా బీసిలు ఇంకా ఇంకా వెనుకబడే ఉన్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయి అని, బీసిలకు మరింత మేలు జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడున్న కులాల వివరాలు అన్నీ 90 ఏళ్ల నాటివి అని అందుకే కొత్తగా బీసిల జనగణన చేపట్టాలని చంద్రబాబు లేఖలో తెలిపారు.  బీసీ జనగణన కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో తీర్మానం చేశాం అని,  టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తీర్మానం కేంద్రానికి పంపాం అని చంద్రబాబు గుర్తు చేసారు. అయితే చంద్రబాబు రాసిన లేఖ, ప్రభుత్వంలో ఉన్న జగన్ ప్రభుత్వం చేయాలి. కేంద్రం పై ఒత్తిడి తేవాలి. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read