నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కడుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ కోసం, ముఖ్యమంత్రి చంద్రబాబు డిజైన్ ల విషయంలో రాజమౌళి సలహా అడిగిన విషయం తెలిసిందే... అయితే ఇప్పుడు ప్రధాని మోడీకి తను చేపట్టబోయే మిషన్ లో సపోర్ట్ చెయ్యమంటూ రాజమౌళికి లెటర్ రాసారు..
దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్బంగా రానున్న అక్టోబర్ 2 వ తేదిన మహాత్మా గాంధీ జయంతి రోజున దేశ ప్రజలు 'స్వచ్ఛత హి సేవా' ఉద్యమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రజలకు పిలుపుఇచ్చారు.. ఉన్నారు.ప్రజలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని , అందుకోసం మీ మద్దతు కావాలని రాజమౌళికి రాసిన లేఖలో మోడీ కోరారు.
లేఖ అందుకున్న రాజమౌళి స్పందిస్తూ, ఒక మంచి కార్యక్రమం చేపట్టిన ప్రధానికి నా హృదయపూర్వక అభింనదనలు.. స్వచ్చ్ భారత్ వంటి కార్యక్రమంలో తనను బాగస్వామ్యం చేయడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నా . స్వచ్చత హి సేవా కార్యక్రమంలో చిత్తశుద్దిగా పాల్గొంటానంటూ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు రాజమోళి.
.@narendramodi ji, heartfelt appreciation for this wonderful initiation. I‘ll do my best to be a part of my Swachh Bharat. #SwachhataHiSeva pic.twitter.com/eTsJOqjX4Y
— rajamouli ss (@ssrajamouli) September 22, 2017