ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాని పర్యటించనున్న గుంటూరు నియోజకవర్గంలో నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోదీ ఏపీలో అడుగు పెట్టవద్దని తెదేపా నేతలు స్పష్టం చేశారు. మోదీని ప్రజలు స్వాగతించరని తెలుగు యువత నేతలు ఆగ్రం వ్యక్తంచేశారు. విజయవాడ లెనిన్‌ కూడలిలో వామపక్ష నేతలు నిరసనకు దిగారు.

moidi 09022019 2

రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ రాష్ట్ర పర్యటనకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మోదీ పర్యటనను అడ్డుకుని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. మోదీ పర్యటనను నిరసిస్తూ కడప జిల్లాలో మట్టి, నీళ్ల కుండలతో వామపక్షాలు వినూత్నంగా నిరసన తెలిపాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో తెదేపా, వామపక్షాల నేతలు కలిసి ఆందోళనలు చేపట్టారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై పెద్ద ఎత్తున మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి మోదీ పర్యటన పట్ల శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

moidi 09022019 3

మరో పక్క, ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారనే సమాచారం నేపథ్యంలో ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక నిరసనకు పూనుకుంది. గో బ్యాక్ మోదీ అంటూ యూనివర్శిటీ పరిపాలన భవనం ముందు అన్ని పార్టీల విద్యార్థినీ, విద్యార్థులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల ముందు ఎస్వీ యూనివర్శిటీ క్రీడా మైదానంలో జరిగిన సభలో శ్రీవారి పాదాల సాక్షిగా ఇచ్చిన మాటను తప్పిన మోదీ.. ఎలా మళ్లీ ఏపీకి వస్తారని ప్రశ్నించారు. తమ నిరసనను శనివారం నుంచి విన్నూత్న రీతిలో కొనసాగిస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read