ఒకప్పటి సినీ హీరో మోహన్ బాబు, ముక్కుసూటిగా మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అనే పేరు ఉంది. గతంలో చంద్రబాబు సియంగా ఉన్న సమయంలో, కొడుకులు ఇద్దరితో కలిసి, అలాగే తన విద్యాసంస్థల విద్యార్ధులతో కలిసి, రోడ్డు మీద పడుకుని, రోడ్డు మీదే నిరసన తెలిపారు. అప్పట్లో ఫీజ్ రీయింబర్స్మెంట్ డబ్బులు రావటం, కొద్దిగా లేట్ అయితేనే, ఇంతలా హడావిడి చేసారు మోహన్ బాబు. తరువాత మోహన్ బాబు పెర్ఫార్మన్స్ నచ్చి, జగన్ మోహన్ రెడ్డి పిలిచి, వైసీపీ కండువా మెడలో కప్పారు. తరువాత జగన్ మోహన్ రెడ్డికి ప్రచారం కూడా చేసారు. మోహాన్ బాబు కోరుకున్నట్టే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇంకేముంది, తన విద్యా సంస్థలకు తిరుగు లేదని అనుకున్నారు. అంతే కాదు మోహన్ బాబుకు పదవులు కూడా ఇస్తారనే ప్రచారం జరిగింది. రెండున్నరేళ్ళ తరువాత పదవులు సంగతి పక్కన పెడితే, తన విద్యా సంస్థలకు రావాల్సిన బకయాలు కూడా మోహన్ బాబు అడగలేని పరిస్థితి చంద్రబాబు ఉన్నప్పుడు కొంచెం లేట్ అయితేనే, రోడ్డు మీద పడి ఫ్యామిలీ ఫ్యామిలీ ఆందోళన చేసి, ఇప్పుడు జగన్ రెడ్డి ఇవ్వకపోతే మాత్రం, మోహన్ బాబు అడిగే ధైర్యం చేయలేక పోతున్నారు. ముక్కుసూటిగా మాట్లాడుతారనే పేరున్న మోహన్ బాబు, పాపం ఇప్పుడు జగన్ ని అడగాలి అంటే భయపడుతున్నారు.
ఈ సందర్భంలోనే, నిన్న మోహన్ బాబు, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఏబిఎన్ లో వచ్చిన ప్రోగ్రాంలో, తన మనసులో భావాలు పంచుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై నేరుగా ఆరోపణలు చేయటానికి వెనకడుగు వేసినా, తాను చెప్పాలి అనుకున్నది మాత్రం చెప్పారు. తన విద్యాసంస్థలను ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. విద్యా సంస్థల విషయంలో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంది వాస్తవమే అని అన్నారు. ఆర్ధిక సమస్యలు కుంగిపోవటం లేదు కానీ, ఆ పరిస్థితి తీసుకొచ్చిన వారి పై మాత్రం ఆలోచిస్తున్నానని అన్నారు. అలాగే తాను ఏమి వైసీపీ పార్టీలో లేనని, ఎన్నికల్లో ప్రచారం చేసానని, గతంలో చంద్రబాబుకి చేసాం, ఇప్పుడు జగన్ కు చేద్దాం అని అనుకున్నా అని, రాజకీయాల్లోకి రాను అంటూ దండం పెట్టారు. తాను ఏది ఆశించలేదని, పదవులు ఎవరికి ఇచ్చుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం అని అన్నారు. అయితే జగన్ ను మాత్రం డైరెక్ట్ గా అనే ధైర్యం లేక, కొంత మంది ఐఏఎస్ ల వైఖరి వల్లే, ఈ రోజు ఈ పరిస్థితి అంటూ, మోహన్ బాబు చెప్పాలి అనుకున్నది చెప్పేసి, జగన్ పేరు చెప్పటానికి మాత్రం భయపడ్డారు.